గోకులవాసుని, నందకుమారుని ;
సందు లేక నా గుండెలలోన ;
నిండిన నాడే పండుగ రోజు ; ||
నిగమగోచరుడు అతడేనంట ;
నిర్మల భావుకుడత డేనంట :
నా మది దోపని తెరవేమో :
తలుపులు తెరువని తీరేమో!? ; ||
కుంజర వరదుడు అతడేనంట!
సుందర శ్యాముడు అతడేనంట!
నా మది మందిర మందున,
ఇతడు - నిలువని తుళువల తనముల
తెరుగేమో, ఈ తీరేమో ; ||
;
pamDuga rOju :-
;
gOkulawaasuni, namdakumaaruni ;
samdu lEka nA gumDelalOna ;
nimDina nADE pamDuga rOju ; ||
nigamagOcharuDu ataDEnamTa ;
nirmala BAwukuData DEnamTa :
nA madi dOpani terawEmO :
talupulu teruwani tIrEmO!? ; ||
kumjara waraduDu ataDEnamTa!
sumdara SyAmuDu ataDEnamTa!
naa madi mamdira mamduna,
itaDu niluwani tuLuwala tanamula
terugEmO, I teerEmO ; ||
;
[ పాట 107 ; బుక్ పేజీ 112 , శ్రీకృష్ణగీతాలు ]
▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼▼▼▼▼▼▼▼▼▼▼▼
No comments:
Post a Comment