కరుణను చూపరె దిక్పాలకులార!
దిక్కు తోచని ఈ రాధిక పైన ఇసుమంతైనా ; ||
;
రాగవీణ పయి మూర్ఛనలను ;
పలికించిన రాధిక,
మూర్ఛన తానే ఐనది,
ఆ పై,
గమకమయము అయి,
లయమై పోయెను; ||
;
విభుని కోసమై ఎదురు చూచినది ;
ఎదురుతెన్నుల ఇసక తిన్నెల ;
మూర్ఛిల్లెను రాధిక - సేదదీర్చరే!?
పారిజాత సుమ గంధములార!
సుమ సుగంధములార!; ||
;
హృదయాలయమున జ్యోతులు ;
వెలిగించెను రాధిక ;
కృష్ణుని కొరకై ;
అర్చన చేసి చేసి ;
సొమ్మసిల్లినది రాధిక సేదదీర్చరే
మలయ శీతల సమీరములార! : ||
;
===========================;
;
raagawINa ;-
;
karuNanu chUpare dikpAlakulaara!
dikku tOchani ii raadhika paina isumamtainaa ; ||
;
raagawINa payi muurCanalanu ;
palikimchina raadhika,
muurCana taanE ainadi,
aa pai,
gamakamayamu ayi, layamai pOyenu; ||
;
wibhuni kOsamai eduru chuuchinadi ;
edurutennula isaka tinnela ;
muurCillenu raadhika - sEdadiircharE!?
paarijaata suma gamdhamulAra!
suma sugamdhamulAra!; ||
;
hRdayaalayamuna jyOtulu ;
weligimchenu raadhika ;
kRshNuni korakai ;
archana chEsi chEsi ;
sommasillinadi raadhika sEdadIrcharE
malaya SItala samIramulAra! : || ;
;
[ పాట 94; బుక్ పేజీ 99 , శ్రీకృష్ణగీతాలు ]
]
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
No comments:
Post a Comment