Monday, December 5, 2016

పదే పదే

చిత్తమనెడు పొత్తములో ;
వ్రాసితిని నామం ; 
వ్రాసితి 'నీ' నామం ; 
శత సహస్ర నామం ;  || 
;
యశోదను తరియించిన నామం ; 
ప్రణయ రాగముల మిళితమీ పేరు ; 
మమతలు వెల్లి విరిసిన నామం ; 
భక్తజనము ప్రణుతించిన నామం ;  || 
;
దేవకి మనమున మంగళ గీతం ; 
దేవేంద్రుని పాలిట శాఖారావం ; 
దేవతా జన మన మంత్రారావం ; 
పార్ధుడు తలచిన గీతా గానం ;   || 
;
పదే పదే నే తలచే నామం; 
గోపీ జన మన మందిరమందున ; 
ప్రతిధ్వనించిన సుందర నామం ; 
ప్రతి నిముషము బృందా వనిలో ; 
మదనుని పులకితు జేసిన నామం ; 
అదే అదే నే పిలిచే నామం ;  || 
;
===========================;
;
               padE padE ;- 
;
naa chittamaneDu pottamulO ;
wraasitini naamam ; 
wraasiti nii naamam 
Sata sahasra naamam ;  || 
;
yaSOdanu tariyimchina naamam ; 
praNaya raagamula miLitamee pEru ; 
mamatalu welli wirisina naamam ; 
bhaktajanamu praNutimchina naamam ;  || 
;
dEwaki manamuna mamgaLa gItam ; 
dEwEmdruni pAliTa SAKAraawam ; 
dEwatA jana mana mamtrAraawam ; 
paardhuDu talachina gItaa gaanam ;   || 
;
padE padE nE talachE naamam; 
gOpI jana mana mamdiramamduna ; 
pratidhwanimchina sumdara naamam ; 
prati nimushamu bRmdaa wanilO ; 
madanuni pulakitu jEsina naamam ; 
adE adE nE pilichE naamam ; AO ;  || 
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
[  పాట 93 ; బుక్ పేజీ 98  , శ్రీకృష్ణగీతాలు ] 

No comments:

Post a Comment