Monday, December 5, 2016

సిరి వెన్నెల మాలిక

గోపిక లందరు వలయము తీరి ; 
కన్నుల విందుగ ఆడిరిలే! 
కన్నుల పండుగ చేసిరిలే! ;  ||

పాల కుండలు, నిండుగ వెన్నలు ; 
నడుమను కృష్ణుని కూర్చుండ బెట్టి ; 
గోపిక లందరు ఆడిరిలే!;  ||  

తెలి తెలి పాలను వాని ఛాయలు ; 
నీలపు వన్నెగ విరిసెనులే!; 
వంగుచు నాట్యా లాడుచు సొగసుగ ; 
కదలెడి భామలు మురిసిరిలే!;;   ||  

తేర్చిన 'వెన్నల దొంతులు ' ఒక పరి ; 
'తెల్లని కలువలు' గా తోచె ; 
నడుమను కదిలే కృష్ణుని నీడలు ; 
నీలపు పుప్పొడి యౌనని ; 
నిండుగ తొణికెడు భ్రమ తోచె! ;  || 

తిరిగెడు కన్నెలు, వేయి రంగుల ; 
కోటి రేకుల పూవులు కాబోలనిపించె! ; 
ఇన్ని వింతల పూవులు ఔరా! 
నీటిని విడిచి, 
ఇటుల నేలను నేడు ;; 
ఎటుల ; 
పూసిన వనుచును సంభ్రమించుచు ; 
'కలువల రేడు' పరుగున వచ్చి ; 
'వెన్నెల చూపుల' వీక్షించె! :  ||   
;
================================;
;
                 siri wennela maalika ;- 
;
gOpikalamdaru walayamu teeri ; 
kannula wimduga ADirilE! 
; kannula pamDuga chEsirilE! ;  ||

paala kumDalu, nimDuga wennalu ; 
naDumanu kRshNuni kUrchumDa beTTi ; 
gOpika lamdaru ADirilE!;  ||  

teli teli paalanu waani CAyalu ; 
neelapu wannega wirisenulE!; 
wmguchu nATyA lADuchu sogasuga ; 
kadaleDi BAmalu murisirilE!;;   ||  

tErchina 'wennala domtulu ' oka pari ; 
'tellani kaluwalu ' gaa tOche ; naDumanu 
kadilE kRshNuni nIDalu ; 
neelapu puppoDi yaunani ; 
nimDuga toNikeDu Brama tOche! ;  || 

tirigeDu kannelu, wEyi ramgula ; 
kOTi rEkula pUwulu kaabOlanipimche! ; 
inni wimtala puuwulu aurA! 
nITini wiDichi, 
iTula nElanu nEDu ;; 
eTula ; 
puusina wanuchunu sambhramimchuchu ; 
'kaluwala rEDu ' paruguna wachchi ; 
wennela chuupula ' weekshimche! :  ||
;
[ పాట 102 ; బుక్ పేజీ 107  , శ్రీకృష్ణగీతాలు ] 

No comments:

Post a Comment