Monday, December 5, 2016

నటన సూత్రధారీ!

కుంజ విహారీ! 
మంజుల పద యుగళ 
   నటన సూత్రధారీ! శౌరీ! :  ||  
;
ఆలమందలను కాచీ కాచీ ; 
నీదు తనులత వాడి పోయెరా!! 
విరుల వీవన తోటి విసరనీయుమురా! :  || 
;
కాళీయునిపై ఆడీ ఆడీ ;
అలసితివేమో! సొలసితివేమో!? 
నీ పద పద్మములను ; 
వత్తనీయరా! నను వత్తనీయరా!:  || 
;
కువలయమును మర్దించి మర్దించి ; 
కరకమలములు నొచ్చినవేమో ; 
హరి చందనమును అలదనీయరా ; 
      కొంచెము అలదనీయరా! :  || 
ఈ రాధిక కోసం నడచీ నడచీ ; 
నీదు సుకుమార దేహము బడలిన దేమో! 
నాదు తనువునే శయ్యగ నీవు ; 
      కునుకు తీయరా కాసింత!; : ||

                 naTana suutradhaarI! ;-
;
kumja wihaarI! 
mamjula pada yugaLa 
   naTana suutradhaarii! SaurI! :  ||  
;
aalamamdalanu kaachii kaachii ; 
nii tanuulata wADi pOyerA!/ yEnurA! 
wirula weewana tOTi wisaraneeyumurA! :  || 
kALIyunipai ADI ADI ;
alasitiwEmO! nii pada padmamulanu ; 
wattaniiyarA! nanu wattaniiyarA!:  || 
;
kuwalayamunu mardimchi mardimchi ; 
karakamalamulu nochchinawEmO ; 
hari chamdanamunu aladaniiyaraa ; 
      komchemu aladaniiyaraa! :  || 
ii raadhika kOsam naDachI naDachI ; 
niidu sukumaara dEhamu baDalina dEmO! 
naadu tanuwunE Sayyaga neewu ; 
      kunuku teeyarA kAsimta!; : ||
;
 [ పాట 98  ; బుక్ పేజీ 103 , శ్రీకృష్ణగీతాలు ]   

No comments:

Post a Comment