నందకుమారుని వెదుకులాడవే!
ఆనందధామము మార్గము కనవే!
మనసా! వేగమె మార్గము కనుగొనవే! ; ||
దాగుడు మూతల - కోమల దేహుడు ;
దాగేనెటనో? దాగేనెటనో? ; ||
చరణ పద్మముల, కంటకమ్ములు గుచ్చుకొనునో ఏమో -
అనుచూ రాధిక డెందము భీతిని వణుకును ;
కృష్ణ చరణ పద్మములను నిమిరేను రాధిక ;
శ్యామల కృష్ణా! రావా! రావా! కనరావా!
కోమలు లందరు వెదుకులాడగ ;
కొలనున శౌరి, దాగేనేమో, దాగేనేమో, : ||
శీతము కమ్మును నీటను నానిన ;
అని క్షోభించును - ఈ రాధిక హృదయము ;
వేగమె రా!రా!రాస విహారీ!
రాధా మానస రాజ్య విహారీ!
చేరగ రావా! : ||
=====================================;
;
kanugonawE! :-
namdakumaaruni wedukulaaDawE!
aanamdadhaamamu maargamu kanawE!
manasA! wEgame maargamu kanugonawE! ; ||
dAguDu mUtala - kOmala dEhuDu ;
daagEneTanO? daagEneTanO? ; ||
charaNa padmamula, kamTakammulu guchchukonunO EmO -
anuchuu raadhika Demdamu BItini waNukunu ;
kRshNa charaNa padmamulanu nimirEnu rAdhika ;
SyAmala kRshNA! rAwA! rAwA! kanarAwA!
kOmalu lamdaru wedukulADaga ;
kolanuna Sauri, daagEnEmO, daagEnEmO, : ||
SItamu kammunu nITanu nAnina ;
ani kshOBimchunu - I rAdhika hRdayamu ;
wEgame rA!rA!rAsa wihaarI!
raadhaa maanasa raajya wihaarI!
chEraga raawA! : ||
;
[ పాట 106 ; బుక్ పేజీ 111 , శ్రీకృష్ణగీతాలు ]
▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼▼▼▼▼▼▼▼▼▼▼▼
No comments:
Post a Comment