Monday, December 5, 2016

ఈ వేళ

వీణా తంత్రి మ్రోగనన్నది ; 
'తంతులమారి' రాని ఈ వేళ :  || 
;
హారశింజితము గుసగుస మన్నది చెవిలోన ; 
కౌస్తుభధారి అధరామృతమ్ము ఏదని? 
చేలాంచలము మర్మరము లాడినది ;
బింబాధరుని చుంబనమేదని?" ;  || 

గోపీ వస్త్రాపహారి దరి లేడే మనుచును : 
కంకణ నిక్వాణము వీనులలోన ఊదినది ; 
గళమున ఊగే వకుళ మాలిక లడిగెను 
పుండరీకుని జాడలు ఏవని? ;  || 
;
మంజీరములు ఘొల్లుమన్నవి ; 
వ్రజ విహారి వచ్చేదెపుడని? 
రాధా హృదయమ్మిపుడు చాల తల్లడిల్లేను ; 
గోపీలోలుడు రాలేదేమనుచును ;  
        డీలా పడుతున్నది ;:  ||  
;
==================================;
;
            ii wELa ;-   
;
weeNA tamtri mrOganannadi ; 
'tamtulamaari ' raani ii wELa :  || 
;
haaraSimjitamu gusa gusa mannadi chewilOna ; 
kaustuBadhAri adharaamRtammu Edani? 
chElaamchalamu marmaramu lADinadi ;
bimbaadharuni chumbanamEdani?" ;  || 

gOpI wastraapahaari dari lEDEmanuchunu : 
kamkaNa nikwANamu weenulalOna uudinadi ; 
gaLamuna uugE wakuLa maalika laDigenu 
pumDareekuni jADalu Ewani? ;  || 
;
mamjiiramulu ghollumannawi ; 
wraja wihaari wachchEdepuDani? 
raadhaa hRdayammipuDu chaala tallaDillEnu ; 
gOpiilOluDu raalEdEmanuchunu ;  
        DIlaa paDutunnadi ;:  ||  
;
[ పాట 99 ; బుక్ పేజీ 104  , శ్రీకృష్ణగీతాలు ]
;  
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ 

No comments:

Post a Comment