పాల వెన్నెలలోన కరిగిపోయెను జగతి!!;
నీ వాలు చూపులలోన ;
జారి పోయె నా మది!
రాధా! జారి- పోయింది నా మది! : ||
ఆమె ;-
రామ చిలుకలకు పలుకులు కరువై ;
ఉలకవు, పలకవు, ఎందులకో!? :
అతను ;-
తేనెల సోనల తలపులన్నిటిని
దోచిన జాణవు, నీ వలననే!
కీరవాణికి అలకలు, కినుకలు! : ||
ఆమె ;-
జిలిబిలి చూపుల పూల దొంతరలు ;
పేర్చితి వేలనో? ఎందులకో? ;;
అతను ;-
నా మదిని దోచిన మంద గమనవు!
పూలశయ్యలు నీ కొఱకే! అవి నీ కొఱకే! : ||
;
; ==========================;
;;
paala wennela ;-
;
paala wennelalOna karigipOyenu jagati!!;
nee waalu chuupulalOna ;
jAri pOye nA madi!
raadhA! jAri- pOyimdi nA madi! : ||
aame ;-
raama chilukalaku palukulu karuwai ;
ulakawu, palakawu, emdulakO!? :
atanu ;-
tEnela sOnala talapulanniTini
dOchina jANawu, nI walananE!
keerawaaNiki alakalu, kinukalu! : ||
aame ;-
jilibili chuupula puula domtaralu ;
pErchiti wElanO? emdulakO? ;;
atanu ;-
naa madini dOchina mamda gamanawu!
pUlaSayyalu nI ko~rakE! awi nI ko~rakE! : ||
;
[ పాట 112 ; బుక్ పేజీ 117 , శ్రీకృష్ణగీతాలు ]
▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼ ▼ ► ► ▼▼▼▼▼▼▼▼
No comments:
Post a Comment