తాళ లేని పున్నమికి ;
కర్పూర విడెమిచ్చి ;
వేళ కాని వేకువకు ;
మలి వీడ్కోలును పలికి : ||
చెలి జడలో మొగలి పూవు తావిని ;
నేనై ఉందును ;
ఉందును నేనిచటనే,
సదా సదా, నిరంతరం ; ||
రాధ జడ పరిమళాల తరాజు ;
తుమ్మెదల కూడలి అయె ;
రాధ కేశ వేదిక ; ||
ఏమని చెప్పుదును ;
తక్కిన పుష్పాల వేదనలు ;
భ్రమరము లన్నియు చేరిన
సీమ ఇదే ఆయెను - అని ;
తమ వంకకు అవి
రావడమే మరిచినవని -
తక్కిన పూవులు అన్నింటీ ;
విలవిలలు, కృంగి కృశించుటలు ; ||
==============================;
;
weeDkOlu
tALa lEni punnamiki ;
karpuura wiDemichchi ;
wELa kaani wEkuwaku ;
mali weeDkOlunu paliki : ||
cheli jaDalO mogali puuwu taawini ;
nEnai umdunu ;
umdunu nEnichaTanE,
sadaa sadaa, niramtaram ; ||
raadha jaDa parimaLAla taraaju ;
tummedala kuuDali aye ;
raadha kESa wEdika ; ||
Emani cheppudunu ;
takkina pushpaala wEdanalu ;
bhramaramu lanniyu chErina
seema idE Ayenu - ani ;
tama wamkaku awi
raawaDamE marichinawani -
takkina puuwulu annimTii ;
wilawilalu, kRmgi kRSimchuTalu ; ||
***********************,
;- [ పాట 111 ; బుక్ పేజీ 115 , శ్రీకృష్ణగీతాలు ]
;
No comments:
Post a Comment