అంబరము చుంబించు ;
అనుపమ ద్యుతి తోడ ;
రాజిల్లు అందాల తండ్రికి ;
; అభివందనం! శుభవందనం! : ||
వక్షమున మక్కువతొ రమణీ మణిని
దాచిన ఉద్విగ్న మూర్తికి అభివందనం!;
ఉరగమున పవళించి ;
చిద్విలాసము చిందు
రాజీవలోచనునికి అభివందనం! ;
; అభివందనం! శుభవందనం! : ||
చరణముల సుర గంగ ముదమున ఉప్పొంగ ;
కరమున అభయము - ముద్రగా ఉన్నట్టి
శ్రీకృష్ణ మూర్తికి అభివందనం!
జగముపై ప్రస్ఫుటముగ ప్రేమ
కురిపించు శ్రీశ్రీనివాసునికి ;
; అభివందనం! శుభవందనం! : ||
;
====================================;
;
chidwilaasuDu
;
ambaramu chumbimchu ;
anupama dyuti tODa ;
raajillu amdaala tamDriki ;
abhiwamdanam! SuBawamdanam! : ||
wakshamuna makkuwato ramaNI maNini
daachina udwigna muurtiki ; abhiwamdanam!;
uragamuna pawaLimchi ;
chidwilaasamu chimdu
raajeewalOchanuniki ;
abhiwamdanam!
abhiwamdanam! SuBawamdanam! : ||
charaNamula sura gamga mudamuna uppomga ;
karamuna abhayamu - mudragaa unnaTTi
SreekRshNa mUrtiki;
jagamupai prasphuTamuga prEma
kuripimchu SreeSreeniwaasuniki ;
abhiwamdanam! SuBawamdanam! : ||
;
[ పాట 109 ; బుక్ పేజీ 114 , శ్రీకృష్ణగీతాలు ]
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ;
No comments:
Post a Comment