లలిత కళలు నాలుగు :-
అవి సంగీత, సాహిత్యములు, చిత్రలేఖన, శిల్ప కళలు.
జ్ఞాపక శక్తిని పెంపొందించే అద్భుత శక్తి "సంగీతము"నకు ఉన్నది.
మానవుని మానస, అలోచనా విధానాలను, ఫీలింగ్సునూ
అతలాకుతలం అవకుండా-
క్రమబద్ధీకరించే శక్తి "సంగీతము"నకు కలదు.
గురజాడ అప్పారావు నాటక హీరో గిరీశం భణితిలో - చెప్పినట్లు
"మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారోయ్!" అని
మనమూ అనుకుందామా?
మానవుని పంచేంద్రియాలనూ, ఇంద్రియ వ్యవస్థనూ
సక్రమ పద్ధతిలో సంగీతము ఉంచగలుగుతూన్నదని -
మన ఆర్య దేశంలో - వేల యుగాల క్రితమే కనిపెట్టారు.
ఇప్పుడు పాశ్చాత్యులు కూడా వెల్లడించిన వారి Reasearch ల ఫలితాల సారాంశం సైతము
అదే కావడము, సుంత విభ్రమాన్ని కలుగ జేసే అంశమే!
" Nature Neuro Science " వారు కొన్ని సంగతులను చెప్పారు.
వారు తమ on line - edition లోని, -
" North Western University " చేసిన
పరిశోధనల కొన్ని వివరాలను తెల్పారు.
(Nina Kraus, Professor of Neurobiology,
Physiology and Communication Sciences
at Northwestern University)
ప్రొఫెసర్ లూ, శాస్త్రవేత్తలూ , నీనా క్రౌజ్ మున్నగు వారి అధ్యయనాల ప్రకారం,
సంగీతం వలన కలిగే ఉపకారముల చిట్ఠా విశేషాలు లోకానికి వెల్లడి ఐనాయి.
పియానో, గిటార్, వయొలీన్ లాంటి వాయిద్యాలను నేర్చుకుంటూన్న
బాల బాలికలనూ, పెద్ద వాళ్ళను పరిశీలించారు.
music instruments పైన సంగీత సాధన చేసిన
వ్యక్తుల మెదడు భాగాల పని తీరును పరీక్షించారు.
సంగీత అభ్యాసకుల మెదడు భాగాలు
సంగీతంలోని స్థాయీ భేదాలను గ్రహిస్తూంటాయి.
Pitch - అనగా స్థాయీ వ్యత్యాసాలను పరిశీలన చేయడము అలవాటు అయిన
brain parts
నిత్య జీవితంలో తటస్థ పడుతూన్న
ధ్వని తరంగాలలోని స్వల్ప భేదాలను కూడా
చిటికెలో పసి గట్ట గలుగుతున్నాయి.
ప్రపంచంలో ఉచ్ఛారణ పరంగా అత్యంత క్లిష్టమైన భాష " చైనా భాష ".
సంగీత విద్యార్ధులు సులువుగా ఆ పదాలనూ, నేర్చుకో గలిగారు.
;
మ్యూజిక్ కి గల శక్తిని గుర్తించిన తర్వాత
సంగీతానికి అమిత గౌరవం ఇనుమడించసాగింది.
అనేక పరిశోధనలతో ఉప శాఖలు అభివృద్ధి గాంచ సాగాయి.
మన భారత దేశంలో ఆర్యుల రాకతో "వేదములు",
నిత్య జీవన విధానాలను తీర్చిదిద్దినవి .
ఋగ్ వేదము,
యజుర్ వేదము,
సామ వేదము,
అధర్వణ వేదములు
ఈ నాలుగు వేదములూ,
వీనిలోని మంత్రాలు లయ బద్ధంగా రూపొందినవి .
ముఖ్యంగా "సామ వేదము" లోని మంత్రోచ్చారణలు
సంగీత నిర్మాణానికి పునాదులు వేసినవి.
ఫలితముగా ప్రజలకు సంగీతము పట్ల అభిరుచిని
పెంపొంద జేసినది ఈ ప్రక్రియ.
క్రమేణా ప్రజా జీవితములతో పెనవేసుకుని,
సంగీతమునకు అవినాభావ సంబంధము ఏర్పడినది.
అందుచేతనే మన ఇండియా లో
సాంప్రదాయకముగా " సంగీత కళ "
అత్యున్నత శిఖరములను అందుకున్నది.
లలిత కళలు - లో "సంగీతము" ప్రధాన స్థానమును ఆర్జించినది.
(By:- kadanbari)
సంగీత ప్రభావము గొప్పది! మ్యూజిక్ ఇస్ Divine
No comments:
Post a Comment