Monday, November 7, 2011

పెద్దపట్నం జాతర


ఇంద్రకీలాద్రి అనే కొండ తెలంగాణాలో ఉన్నది. (బెజవాడ కనకదుర్గమ్మ కొలువు ఐన చోటు "ఇంద్రకీలాద్రి")
చెర్యాల మండలములో కొలువుతీరాడు కొమరెల్లి మల్లన్న దేవర.
వరంగల్ కు దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రము.
మల్లన్న యాదవ కన్య "గొల్ల కేతమ్మ"నూ, లింగబలిజ "మేడలమ్మ"నూ పెళ్ళి చేసుకున్నాడు. భార్యల మూర్తులు కూడా ఇక్కడ ఉన్నవి.
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవళము,
తెలంగాణా ప్రాంతాలలో ప్రసిద్ధి.
విగ్రహ రూపములో గుట్ట పైన గుహలో వెలిసిన దేవుడు .
"కొమురవెల్లి మల్లన్న కోర్కెలు తీర్చే మల్లన్న" అని భక్తి కీర్తనలు ప్రసిద్ధి.
ఈ కొమురవెల్లి మల్లన్న స్వామి Statue
"పుట్టమన్నుతో తయారు చేయబడినది"
అదీ ఇక్కడి విశేషం.
కొమురవెల్లి మల్లన్నస్వామి విగ్రహము యొక్క నాభి(బొడ్డు) లో
"స్వయంభూ లింగము(పుట్టు లింగము)" ఉన్నది.
అందు చేతనే ఈ మూర్తికి
ఎంత తడి, తేమ తగిలినప్పటికీ,
నిత్య నూతనంగా ఉంటున్నది.
కొమురవెల్లి మల్లన్నపుణ్యక్షేత్రములో ఒక వృక్షము ఉన్నది.
అది గంగరావిచెట్టు. కొమురవెల్లి మల్లన్న కోవెల,
ఈ గంగరావి చెట్టు సమాన వయస్సు ,
అనగా 500 ఏళ్ళు.
కాకతీయుల కాలము నాటి వీర శైవ ఆచారాలు అనుసరించబడుతూన్నవి.
"ఒగ్గు కథ, ఒగ్గు విధాన అర్చనలు"ఆచరణలో ఉన్నవి.
మట్టి పాత్రలలో ప్రసాదములను వండుతారు.
ఆ ప్రసాదపు కుండలను తమ తమ గృహాలకు తీసుకువెళ్ళి, తింటారు.
భుజించిన  తరువాత
ఆ పవిత్ర పాత్రలను పాడి వృద్ధి అనే దృక్కోణముతో వాడుతారు.
ప్రసాద కుండలలో గేదెల, ఆవుల,పశువుల పాలను పికుతారు.
అందు చేత ఏడాది పొడువునా తమ ఇళ్ళలో
పశు సంపద, క్షీర సంపదలు సమృద్ధిగా ఉంటాయని
భక్తుల నమ్మకము.
పెద్దపట్నం జాతర అని పేరుపొందిన
శివరాత్రి జాతర   ఘనంగా జరుగుతుంది.

&&&&&&&&&&&&&&&&&&&&&

గంగరావి చెట్టుకి 500 సంవత్సరములు (Tulip tree ?)
;

No comments:

Post a Comment