Thursday, November 24, 2011

హెచ్చుతగ్గుల వీరుడు


కన్నయ్య రాకకై ఎదురుచూచీ చూచి;      
చిన్నబోయీ ఉన్నబేల రాధను గనుచు
ఎగతాళి సేయకురా! చందురూడా!                  ||  

పదహారు కళల హెచ్చుతగ్గుల జోదు! చందురుడా!
నాటి నీ గాధలను గ్యాపకము చేసుకో!
ఒరులను- నిరతము అపహసించేవు
నీ -చిన్న బుద్ధినీ మానుకోవోయీ! చందురుడా!    ||  

బొజ్జ గణనాధునీ- తిలకింఛి అలనాడు ; హేళనగ నవ్వితివి                  
హిమపుత్రి ఆగ్రహము నీ పాలి శాపమయె
శుక్ల, బహుళముల రూపులైనవి  నీవి!        
నీ -చిన్న బుద్ధినీ మాపుకోవోయీ! చందురుడా!    ||    
                     
"గ్రహపాటున నీదు- వదన దర్శనమున ;    
జనులెల్ల ఇక్కట్ల పాలు ఔతారనీ    
" ఘోర శాపము మాట మరచిపోతావా?
 నీ -చిన్న బుద్ధినీ మాపుకోవోయీ! చందురుడా!    ||      

దక్షునికి వెరచిన,నీ ఉనికి కాస్తా;
ఈశుని సిగపాయలందున దూరినది;
"కను లొట్ట పోవుట అను మాట వాడుక      
నీ మూలముననే! మరువకు శశాంకుడా!             ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment