నీలాల నిగ నిగల కాంతులకు;
ఈలాగు- స్నానాలు చేయించునది
ఎవరు? - ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!?
ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!? ||
గగనాల నీలిమల కాంతులన్నిటికిని
చాల గుబులౌతోంది,ఓయమ్మ! చూడవే!
"స్వామి కురులందున కులుకు వీలు
తమకు కలుగలేదే", అనుచు; ||
క్రిష్ణ! నీ కుంతలము లల్లనల్లన గాలి
కెగురుచు బాగ అల్లరి సేయు, ఈ వైనమిది ఏమి?
అదుపు సేయుము వానినందాలబాలుడా!
మా నంద నందనుడ! ఆనంద మోహనుడా!
పరిసరమ్ములన్నిటికీ ; క్రమశిక్షణను నేర్పు
ఘన- అధ్యాపకుడివీవు; అందుకే గదుటయ్య
ఇంతగా మేము మనవి సేసేము, చేస్తున్నాము!?!
మా నంద నందనుడ! ఆనంద మోహనుడా! ||
నీలాల నిగ నిగల కాంతులకు;
ఈలాగు స్నానాలు చేయించునది
ఎవరు? ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!?
;|
అందాలబాలుడు! మా నంద నందనుడు!
ఆనంద మోహనుడు!
No comments:
Post a Comment