ఆలమందల కాచుచూ ఆ అడవిలోన;
గోపబాలుడ!
విద్యలను, కళలను రమ్యమొనరిస్తావు;
నీవున్న ప్రతి తావు
వనదేవి వాసమే! రస రమ్య రాజ్యమే! ||
;
లీలగా తన వ్రేళ్ళు, నాట్యమాడిన వేళ;
వెదురు కాస్తా; వేణువైనాదిరా!
దొరా! -
శూన్య వంశీ కూడ;
రాగ భోగినిగా మారి పోయిందిరా! ||
;
సిగలోన పూవులకు, పోటీగ పింఛములు;
ఆసీనులవగాను; పట్టుబట్టిన నెమలి గెలిచిందిరా!
దొరా!
తన పురిని విప్పార్చి
నెమలి కన్నులు చాల ఇచ్చిందిరా! ||
**************************\\\
వనదేవత నివాసము ; కళా రస రమ్య రాజ్యము ;
;
No comments:
Post a Comment