Saturday, November 19, 2011

గగన హాసము


ఆకాశమే శ్రీధరుని దరహాసమ్ము  
శాంతి దుర్గమునకు గొప్ప ప్రాకారమ్ము   ||
;
అందుకే నా మది
ప్రభు మందిరమ్మాయె - ననుచు
కనుగొంటినీ నాడు - నేడే! ఈ నాడే!      ||
;
నాకమున దివ్యులు అతి శ్రద్ధతోడ
నక్షత్ర శిల్పములు చెక్కి నిలిపినారు!
తారల చెక్కుల మిల మిలల రజనులు;
స్వామి నును చెంపలకు అద్దిన పుప్పొడులు ||
;
యక్షులు, కిన్నెరలు అతి మమతతోడ;
కస్తూరి తిలకములు తీర్చి దిద్దారు;
నీదు చుబుకములను మృదువుగా పుణికేరు
దిష్టి బాగా తీసి మెటికలను విరిచేరు       ||
;
(గగనమంతటి హాసము)

No comments:

Post a Comment