కొలనున తామర, కలువల్లు;
అందాలకు విలువౌ నెలవుల్లు ||
జలముల ఈదే నెలవంక;
కొబ్బరిమట్టలు ఇచ్చునులే!;
“చంద్రుని కెన్నో నూలుపోగులను ||
ఒడ్డున కులుకుతు లుకలుకలాడే
పీతలు, నత్తలు, చిటి తాబేళ్ళు
పరుగు పందెమున జమాజెట్టిలు ||
పిలలు కట్టిన పిచ్చుక గూళ్ళు;
తీరములందున ఇసుక తిన్నెలకు;
సింగారించిన పాపిటి బిళ్ళలు ||
పెద్దల్లారా! శషభిషలెందుకు?;
మీ ఉడుకుమోతుతనములు తొలగించి,
పిన్నలతోటి చేతులు కలిపి;
శాంతితొ చేద్దురు సహవాసమును ||
;
ఇసుక తిన్నెలకు పాపిటి బిళ్ళలు ;
October 30, 2011 By: జాబిల్లి (Link for poem song)
Category: పాటలు
రచన : కుసుమ
No comments:
Post a Comment