;
సప్త గిరి వలయముల
సోపాన పంక్తులు ఇవి!
భక్త కోటి పాద ముద్రలు
ఇవియే!
నక్షత్ర మణుల సుప్రభలను ఈను
కాంచన ఆభరణమ్ములివియియే! ||
సాదా సీదా నడకలు కూడా
నాట్యములాయెడు వేయి వరముల
సాతాళములు దొరికె కదా!
అపురూపముగా దొరికే గదా! ||
ఇంద్రుని పూజలు, చంద్ర అర్చనలు ;
సప్త గిరీశుడు గైకొనగా ;
నగముల శోభల నేమి అందును?!
మాటలకూ అవి అందనివి! ||
;
**********************\\\\\\\\\\\\
No comments:
Post a Comment