Sunday, November 20, 2011

భద్ర పరుస్తాము, ఒట్టు!


ఒకే జట్టుగా ఉందామే!
గోవిందుని పట్టుకుందామే!
          ఇట్టే  పట్టుకుందామే!   ||
~
మల్లెల పొదలలొ దాగునాడో?
పందిరి వేస్తాము;
              పందిరి మీకు వేస్తాము;
మురళీ క్రిష్ణుని జాడలెక్కడో; దయతో కాస్త చెప్పండి;
ఓ మల్లియలారా! మాలతీ మాధవ సంపెంగల్లారా! ......
బృందా వనమున మీ నెలవులను,
              బాగా భద్ర పరుస్తాము ఒట్టు!  ||
~
కన్నెల నవ్వుల వెన్నెల  కాంతుల
                అరువుగ మీకు ఇస్తాము
చక్రధారి చిరు గురుతు వివరణలు
చక్ర వడ్డీలుగ ఇచ్చేయండీ!
              మాకు చక్ర వడ్డీలుగ ఇచ్చేయండీ!             
కనకాంబరములూ!మిము మాలలు అల్లీ,
శృంగార రాయునీ- గళమున ఉంచీ, అలంకరించీ ;
రాధాదేవి మమతలను మీకందిస్తాము  ||
~
::::: ఓ యమునమ్మా!
మా,కన్నుల కలువల రేకుల శోభల ;
                   అరణముగా ఇచ్చేస్తాము
యమునా జలములదాగున్నాడో?        
ఉప్పొంగే ఓ కెరటములారా!        
స్వామీ స్పర్సలో మైమరచేరు!
అదనును చూసీ,
అనంత పద్మనాభుని జాడలు; బాగా చెప్పేసేయండీ  ||
~

********************** ||
 

No comments:

Post a Comment