Friday, September 2, 2011

పొలాలే చిత్రాలు, బొమ్మలు (Essay)


జపాన్ మున్నగు దేశాలల్లో వరి పొలాలు, పంట పొలాలు 
అందమైన బొమ్మలు గల కాన్వాసులుగా అవతరిస్తున్నాయి. 
spectacular giant crop murals గా 
పంట పొలాలు సాక్షాత్కరిస్తూన్నాయి. 
ఇవి ఆధునిక కళా జగత్తు లో స్థానం ఆర్జించినవి. 
లలోనే, రక రకాల బొమ్మలను పెంపొందిస్తారు.
cultivated JAL ఒక కళగా రూపొందింది.
అడ్వర్టైస్ మెంట్లు, ప్రకటనలు కూడా ఇలాగ చిత్రించవచ్చునన్నమాట!
ఈ విశాల సస్య కేదారాలు
కర్షకుల చక్కని ప్రణాళికతో, ఓర్పుతో కూడిన నేర్పునకు నిదర్శనాలు.
పంట వేసే టైములోనే ఎలాటి బొమ్మను ఎలా వేయాలో యోచిస్తారు.
బ్రహ్మాండమైన మురల్స్ ను ఇలాగ కొందరు పెంచుతున్నారు.
ఈ సువిశాల ధరిత్రీ చిత్రములు
సృష్టికర్తకు, సృజనకారునికీ మానసిక సంతోషాన్నీ,
ఆత్మానందాన్నీ ఇస్తాయి.
అంతే కాదు, సినిమా షూటింగులు,
టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణనూ కలిగిస్తూ,
కొత్త బంగారు లోకాన్ని ఎట్టెదుట నిలుపుతున్నాయి.
ఇలాటి the rice paddy art venues
ఆహార సముపార్జనకే కాక
మానవునిలోని అంతర్లీన కళా తృష్ణకు కూడా
ఆనవాలుగా నిలుస్తున్నవి కదూ!
అన్నం పరబ్రహ్మ స్వరూపం!అన్నం పరబ్రహ్మ స్వరూపం!
బియ్యం గింజల మీద అతి సూక్ష్మ చిత్రలేఖనములను చిత్రించి,
అందరినీ అబ్బుర పరుస్తునారు.

ఇలాంటి కళ- కొత్త పద్ధతులలో సాగుతూన్న
కళా మార్గాలు అభినందనీయాలు.
బియ్యం గింజల పైన మాత్రమే కాకుండా
బియ్యం పొలాలను కూడా = వరి పైరు క్షేత్రాలను కూడా
రసజ్ఞులు చిత్రలేఖన యవనికలుగా మార్చగలగడం
ఆధునిక యుగ అద్భుత మేధో విన్యాసాలకు ప్రతిబింబాలు.
ఔర! ఔరా! ఔరౌరా!

వెబ్ Ecoist  (లింక్ 1)



No comments:

Post a Comment