Thursday, September 29, 2011

బడి - వెన్నెల సవ్వడి


school of kid's dreams 















"బడి" అంటే అక్షరాల గుడి- నేస్తం!  
ఈ వాక్యము సాక్షాత్తూ వేద వాక్కు, సత్యం
ఇది అక్షర సత్యం! పునః పునః సత్యం! ||  

"విద్య రాని వాడు
వింత- పశువు" అనే నానుడి!;
ఇది ఒక్క -
"నా-నుడి" మాత్రమె కాదు,  
ఇది అందరి ఎడదలలో                  
వడి వడిగా జాల్వారే
పసిడి జాబిల్లి వెన్నెల సవ్వడి       ||    

ప్రతి మనసూ - సుక్షేత్రము
ఉల్లాసము పుష్పము,
విరబూయును నిత్యము
అది,
"చదువు" యొక్క మహిమము ; ||
   
మంచి భావముల జాగృతి  
శాంతి తరు లతాగ్రములు,
పల్లవములు, పత్రముల
పచ్చదనము విలసిల్లును     ||


***********************\\\\\\\

No comments:

Post a Comment