Friday, September 30, 2011

అ - అచ్చులు


పలక పైన రాసాను,"అ""ఆ"


ముక్క, ముక్క - చెరుకు ముక్క
ముక్కలోన తీపి రసము

తీయని రసమును తీసీ తీసీ
బానలలోన మెండుగ వండీ
దండిగ బెల్లపు దిమ్మలు వచ్చె!

మధురమ్మౌ ఆ అచ్చులు తెచ్చీ
నాన్నారేమో అమ్మకు ఇచ్చిరి;
అమ్మ చేతి కమ్మని స్వీట్లు
నచ్చెను పిన్నలు, పెద్దలందరికి!

అరిసెలు తింటూ గంతులు ఆటలు;
"చిందులు చాలును! పిల్లల్లారా!
  చదువుల వేళ ఆయెను! రండి!
  బాసిం పెట్లు వేసుకుని,
  బుద్ధిగా కూర్చుని, చదవ0డీ!"
  అ0టూ తాత గద్దించాడు;

"అచ్చులు, హల్లులు నేరుస్తాము
భారత మాతకు జై! జై! జోతలు!
రేపటి పౌరులం!  పిల్లలము!
పిల్లలము మేము పిల్లలము"  

*****************************\\\\\\\\

      అ -  అచ్చులు - Lesson 1
         
                          రచన ;    kadambari

No comments:

Post a Comment