Wednesday, September 7, 2011

పత్ర సంపద


త్రమా!
నీ గొప్పదనాన్ని చిత్రించేందుకు
ఆకు పచ్చ వర్ణం- చాలు!
ఐతే,
ప్రకృతి -  పచ్చ దనాన్ని అలుముకున్న తర్వాతే గదూ
ఏ వన్నె కైనా
శ్రీకారం చుట్టుకోబడుతూన్నది!


పూలూ, పైర్లు,
నవ నవలాడే నవ ధాన్యాలు, పళ్ళూ
వానితో అనుసంధానమైన ప్రాణి కోటీ.....
ఇన్నిన్నీ, ఇన్ని రంగులు ప్రతిష్ఠించబడుతూన్నాయి
అంటే- మూలం నీవే సుమీ!

అందుకేనేమో
ఆది దంపతులకు
ప్రీతి ఐనవి బిల్వార్చనాదులు!!!!
గణపతికి నూటొక్క పత్రి పూజలే
                      బహు వేడుక !!!!!!

తాను సుఖముగా శయనించు   
ఆదిశేషు తల్పాన్ని వీడి
శ్రీవిష్ణుమూర్తి
వటపత్రశాయిగా ముద్దులొలికాడు
వరహాల ఎత్తుగా నిన్ను గుర్తించాడు,
దైవ అర్చనలో
నిన్ను – అంతర్భాగస్వామినిగా చేకూర్చుకున్నాడు


ళి భళీ!
ఆ భగవంతుని ఈ చమత్కారం!!!!
“పత్రం పుష్పం ఫలం తోయం.....”
తామరాకుల లేఖలు
అభిజ్ఞాన శాకుంతలమ్
కాళిదాసు మహర్నాటక రచనకు
కాంతి రేఖలు ఐనవి

తాళ పత్రములే
ప్రాచీన కాలమ్మునందిన
భారతీయ సాహితిని పదిలపరచీ,
మనకు అందించినాయి

మరి, మామిడాకుల తోరణాలు
గృహ సామ్రాజ్యముల సమీరములతో
చెబుతూనే ఉంటాయి ఈలాగున....
“ఓ మానవుడా! భగవంతుడే గుర్తించినాడు
హరితదనముల పత్ర సంపద గొప్ప విలువలను
పుడమినందున సంతసాలు
నిరంతరమూ పల్లవించాలంటే
పచ్చదనమును సంరక్షించుకొనుటయె
నీదు బాధ్యత, తెలుసుకొనుమా!”

అందుకే ఓ మనుజులారా!
ధరణి తరువుల పసిడి భరిణగ
నిరంతరము ప్రకాశించాలనుచు
ఎల్లరు కోరుకుందాము
ఇలాతలముకు
ఈ సద్భావనా ఆకాంక్షలు
శుభాశీస్సుల శీకరములు

&&&&&&&&&&&&&&

(పత్ర సంపద)

No comments:

Post a Comment