Saturday, September 10, 2011

Kites క్రీడలుపతంగీలు !పతంగీలు!
మబ్బులతో పంతాలతో
నీలి గగన శోభలెంతొ
ఇనుమడించెను
రంగు పతంగీ లేఖలు
అందుకొనును రోదసి!

గాలి పటపు కావ్యాలను
గగనమ్ములు పఠియించును
తారలు తనకే రాసిన
ప్రేమ లేఖలివి! కాబోలును!
అని తలచిన చంద మామ
వెన్నెల చేతులను చాచి

వలపు మీర తడిమి చూచి
తడి వెన్నెల నయనమ్ముల
ఆమూలాగ్రము చదువును
గాలి పడగ ఉత్తరములు

@@@@@@@@@@@@@@@@@@@@@               


తడి వెన్నెల నయనమ్ముల!

By kadambari piduri, Feb 10 2009 3:59PMగాలి పటాలు (Link:-  aavakaaya,kam)
No comments:

Post a Comment