Wednesday, September 7, 2011

ప్రకృతి ఘన వ్రతము


ఆనంద బాష్పమ్ములు, ఆణి ముత్యములు


తిరుమల శిఖరాల పైన;
ప్రకృతి ఘన వ్రతము సేయు వింత చూడుమా! చెలీ! ||

రాయి రప్ప తాళ వాద్య- రవములను పలికించును;
హాయి నింగి నీరదాల - ఘన మర్దళ ధ్వానమ్ములు||

నెమలి పురికి, మకర తోర-ణములతోడ చెలిమి కూర్మి;
ఖగ రాజు రెక్కలతో - స్వామికి ఛత్రములను నిలుపును ||

పద్మావతి సతి కన్నుల-ఆనంద బాష్పమ్ములు;
పద్మనాభునీ మేనున -సురభిళ ఆణి ముత్తెమ్ములు అవి, కన్నారా!? ||

  [సురభిళ ఆనంద బాష్పమ్ములు ఆణి ముత్యములు]

No comments:

Post a Comment