లాలి లాలీ లాలి బాల సుకుమారీ!
లాలి జో! జో! లాలి బాల మహ ధీరుడా! ||
బాల బాలికల అందాల కలలు;
ఆ కలల లోకములను – పాలనము సేయగా
విచ్చేసెనమ్మా నిబ్బరపు రాత్రి ||
రేయికి చెల్లాయి – 'నిద్దుర యువ రాణి'
స్వప్న లోకములన్ని – హుందాగ విహరిస్తు
కలల కథలెన్నిటినో!తాను నేర్చేనమ్మ ||
ఈ పాఠశాలలో - కథలు ముక్కోటి
నేర్చుకోవడమంటె- ఎల్లరకు బహు సరదా!
అందుకే అందరూ- శిష్యులుగ మారుదురు
కమ్మ కమ్మని కథలు బోలెడు నేర్చేరు! ||
రచన- కాదంబరి
@@@@@@@@@@@@@@@@@
lAli lAlI lAli bAla sukumArI!
lAli jO! jO! laali baala maha dhIruDA! ||
baala baalikala aMdaala kalalu;
aa kalala lOkamula – paalana sEyagaa
vichchEsenammaa nibbarapu raatri ||
rEyi china chellaayi – niddura yuva rANi
svapna lOkamulanni – huMdaaga viharistu
taanu nErchEnamma – kalala kathalenniTinO! ||
I paaThaSAlalO - kathalu mukkOTi
nErchukOvaDamaMTe- ellaraku bahu saradaa!
aMdukE aMdarU- Sishyuluga maaruduru
kamma kammani kathalu - bOleDu nErchEru! ||
writer:- kadambari
@@@@@@@@@@@@@@@@@@@@@@
nice photo (Link)
;
No comments:
Post a Comment