ఉల్లాస సంపత్తి |
సకల జీవులకు చకిత చతురముగ చిత్తో-ల్లాస సంపదలు
నికరముగా, ఉన్న పాటుననె-లభియించినవి
యేమి వింత?, ఇది యేమి వింత?!! ||
చిన్ని క్రిష్ణా!!
నీ- వినీల విలసిత కుంతలమ్ముల- హేలగ చేరెను భ్రమర శతమ్ములు; అలకల చేరి ఊయలలూగే- పిల్ల గాలులు; అళులపైన బహు అలుకలు పొందెను ||
కొలను జలముల - సూర్య కిరణములు;- చంద్ర జ్యోత్స్నలు, చుక్క బింబములు,
మెలగు వినయముగ- నీ, నఖ ద్యుతులందున - తామెల్లరు ఇతిహాసములైనవి ||
సకల జీవులకు చకిత చతురముగ చిత్తోల్లాస సంపదలు
నికరముగా, ఉన్న పాటుననె- ఒనగూడినవి
యేమి వింత?, ఇది యేమి వింత?!!
Answer:-
నేనేమని అందును?
ఇది యే వింత!
అహాహా! కనుగొనగా
ఇదియే మన అందరి వింత?
మన వింత?||
No comments:
Post a Comment