Saturday, September 17, 2011

“చెల్లపిళ్ళరాయ చరిత్రము”, “తాళ్ళపాక అన్నయ కవి


Melukote kovela


“ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” – రచయిత:- డాక్టర్ మంకాల రామచంద్రుడు

గండ పెండేరములను, అనేక బిరుదు సత్కారములను పొందిన విద్వాంసుడు ప్రకాశ రావు.
ఆశావాది ప్రకాశ రావు “ఆసాది” అనే దళిత ఉప కులమునకు చెందిన వ్యక్తి.
ఆసాదుల వృత్తి- కథా గానము.
వి.సుబ్రహ్మణ్యము నిఘంటు నిర్మాణ శాఖాధిపతి.
వడ్లా సుబ్రహ్మణ్యము ఆధ్వర్యములో
మంకాల రామచంద్రుడు ~~~
"అవధానాచార్య ఆశావాది ప్రకాశ రావు గారి" 
జీవన ప్రస్థాన, సాహిత్య సృజన, కృషీ క్షీర మథనమునూ చేసి,
ఈ గ్రంథ నవనీతమును పఠితల చేతిలో ఉంచారు.
340 పేజీలు ఉన్న ఈ పుస్తకమును అందమైన ముద్రణతో,
అచ్చుతప్పులు లేకుండా వెలువడడానికి కారకులైన ప్రచురణకర్తలు ప్రశంసార్హులు.

‌ఈ‌పుస్తకం లో ప్రస్తావించిన ఒక యక్షగానము – చెల్లపిళ్ళరాయ చరిత్రము:

చల్లపిళ్ళ, చెలపిళ్ళ అని కూడా ఈ గ్రంధములోన వాడబడినవి.
 “సెల్వపిళ్ళై” అనేది తమిళ పదము,
ఆ మాటకు అర్ధం “సుందరమైన దైవము”.
దానికి వికృతి పదమే- “చెల్లపిళ్ళ”.
108 తిరుపతి క్షేత్రములు ఉన్నవి.
వానిలో- ఒకటి యాదవాద్రి.
Cheluvanarayana Swamy

మైసూరు లోని మేల్కోటె- అనే ఊరులో
“యాదవాద్రి”లో శ్రీ వేంకటేశ్వర మూర్తి నెలకొని ఉన్నాడు.
( Cheluva Narayana Swami/ chella pille raya/
TiruNarayana in Yadugiri/ yadadri; Melkote, Karnataka state)
తాళ్ళపాక అన్నయ:-
ఈ యక్షగానము, గ్రంధ కర్త.
నాందీ పద్యాలలో-
“శేషాద్రిపతి కృతిభర్త పేరు; కృతికర్త నామము “తాళ్ళపాక అన్నయ్య”.
అనేక ఆధారములతో- అన్నయ కవి-
ప్రఖ్యాత పదకవి - ఐన “తాళ్ళపాక అన్నమాచార్యుని” మనుమడు- అని వక్కాణించాడు ఆశావాది.
తాళ్ళపాక అన్నమయ్య కు ముగ్గురు కుమారులు:-
 నరసింహ కవి,
పెద్ద తిరుమలాచార్యుడు,
అన్నయార్యుడు.


వీరిలోని రెండవ వాడైన పెద తిరుమలాచార్యుని తనూజుడే
ప్రస్తుత వ్యాసాంశమైనట్టి “చెల్లపిళ్ళరాయ చరిత్రము” గ్రంధ రచయిత.
1500 సంవత్సర ప్రాంతము వాడు.

ఇందలి కథ:-

శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు
ఢిల్లీ సుల్తాను కూతురు “బీబీ నాంచారు” ని వలచి, పెళ్ళి చేసుకోవడం.
(“తిరుపగూడు” మున్నగు పదాలు ఈ యక్షగానములో కలవు)

ఈ పుస్తకమును గుంతకల్లులోని
“భువన విజయ శారదా పీఠము” వారు ప్రచురించారు.
ఈ గ్రంధ ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానము వారు,
ఆశావాది మిత్రులు సౌహార్ద్ర ఆర్ధిక సాయాన్ని అందించారు.
ఈ పొత్తమును “విజయ శారదా పీఠము” వారు ప్రచురించారు.
ఈ పైన చెప్ప బడిన అంశాలు కాక, మరో ప్రత్యేకాంశము ఉన్నది.

అదేమిటంటే – ఒక శిష్యుడు – 
తన ఉపాధ్యాయుని జీవితము గురించి రీసర్చ్ పుస్తకాన్ని రాయడము.
ఆ విద్యార్ధి – డాక్టర్ మంకాల రామచంద్రుడు.
ఈయన గురుభక్తితో “ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” అనే
పుస్తక రచనకు ఉపక్రమించారు.
2004 లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నుండి
P.hd.పట్టమును (పట్టాను) పొందిన గ్రంథము ఇది.

[ఆధారము:-“చెల్లపిళ్ళరాయ చరిత్రము”,
ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము"; పేజీ 268;]

****************************************\\\\\\\\

రచన:-డాక్టర్ మంకాల రామచంద్రుడు:
ప్రచురణ:- శ్రీ కళామంజరి. షాద్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా:]

ప్రతులకు:-శ్రీమతి మాధవి, M.Sc., B.Ed.,
ఇంటి నెంబర్:: 18-533,
తిరుమల కాలనీ,
షాద్ నగర్,
మహబూబ్ నగర్ జిల్లా- 509216

ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము
   23 JULY 2011 58 VIEWS 

రాసిన వారు: కాదంబరి
*****************
“చెల్లపిళ్ళరాయ చరిత్రము” 7727 ; ( About book) (Link 1)
                                 పుస్తకం.నెట్
వ్యాస లహరి  (Link 2)
Akhilavanitha ; Tuesday, April 12, 2011

సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”6369  (లింక్ 3)
                 30 JANUARY 2011 159 VIEWS ; pustakam. నెట్ 
సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”  
Price ; Rs25/- ప్రతులకు; 
Bollapalli subba rav, ( Retd Bank Manager),  
“Srinivas” ; 7-2-13 Lawyer Pet,
2 va viidhi, Ongole – 523002 ;   
లాయర్ పేట; ఒంగోలు               
ph; 08592-234262 ; Cell; 9705456900


మెల్కోటే/ Melukote/ Melkote , Mandya డిస్ట్రిక్ట్

No comments:

Post a Comment