Saturday, September 3, 2011

ఏనుగు నల్లన – ఎందుకని?


Banteay Srei Temple












"ఏనుగు ఏనుగు నల్లన

ఏనుగు కొమ్మలు తెల్లన

ఏనుగు మీద రాముడు

ఎంతో చక్కని దేవుడు ”

బాల బాలికలు పాటలతో ఆటలు ఆడుతూ ఉన్నారు.
అక్కడికి మాస్టారు వచ్చారు.

మయూరికి సందేహం కలిగింది.
“మాస్టారుగారూ!  ఏనుగు అంత నల్లగా ఉంటుందేమిటి?
- ఏనుగు నల్లన -  ఎందుకని?”
మాష్టారు - అందుకు గల కారణము, కథా కమామిషూలను
శిష్యపరమాణువులకు ఇలాగ చెప్పసాగారు.
ప్రాచీనకాలంలో ఏనుగులు తెల్లగా ఉండేవి.

ఏనుగుల మేను రంగు
కాస్తా నల్ల రంగుగా మారడానికి కారణమేమిటి?
ఈ పరిణామానికి ఒక స్థల పురాణము ఉన్నది.
ఆనైయూర్ అనే పుణ్య క్షేత్రము, తమిళనాడు లో ఉన్నది.
ఈ దేవళమునకు ఒక గాథ కలదు.
దేవతల పాలకుడు ఇంద్రుడు.
సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనము ఏనుగు,
దాని పేరు ఐరావతము.
దాని వన్నె తెలుపు.
“తాను దేవేంద్రుని వాహనమైనందుకు”
ఆ గజరాజు గర్వం కలిగి ఉండేది.
ఒక రోజు స్వర్గమునకు దూర్వాస మహర్షి వచ్చాడు.
దూర్వాసుడు- అంటేనే
ముక్కుమీద కోపం కలవాడు – అని
ఆ ఋషి తత్వము గురించి అందరికీ తెలుసు.
అందుకనే ఇంద్రుడు మునికి స్వాగతం పలికి మర్యాదలు చేసాడు.
దేవేంద్రుని మన్నన, వినయ విధేయతలకు దూర్వాస ముని సంతోషించాడు.
ఇంద్రునికి అతను ఒక తెల్లని పుష్పమును ఇచ్చాడు.
ఆ white flower పరిమళాలను వెదజల్లుతూ ఎంతో కాంతివంతంగా ఉన్నది.
ఇంద్రుడు “ఈ పువ్వును నా భార్య శచీదేవికి ఇస్తాను” అని అనుకున్నాడు.
కానీ ఆ రోజు సభలో చతుర్దశభువనముల యొక్క అనేక సమస్యలను గురించి,
కుబేరునితో, మంత్రులతో చర్చిస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
పని ఒత్తిడి వలన ఆతడు దివ్య ప్రసూనము గురించి పూర్తిగా మర్చిపోయాడు.
ఇంద్రుడు ఐరావతము పై నుండి దిగుతూ,
హస్తి అంబారీలోనే దాన్ని మర్చిపోయాడు.
దివ్య సుమము తన పైన ఉండడము వలన
ఐరావతమునకు అమిత తేజస్సు కలిగింది.
అసలే తెలుపు, ఇప్పుడు అమోఘ తేజస్సుతో, మిసమిసలాడసాగింది.

ఇంకేముంది, పట్టపగ్గాలు లేకుండా సంచరించసాగింది,
అంతటితో ఊరుకోకుండా అందర్నీ ఊరికేనే పరిహసించసాగింది.
ఒకనాడు దూర్వాసుడు మేఘమండలములో సంచరిస్తూండగా
ఐరావతం కంటబడ్డాడు.

తన తొండంతో బుస్సున గాలి ఊదింది. ముని పడబోయి నిలదొక్కుకున్నాడు.
తెల్ల ఏనుగుకు అంత గీర ఎలా కలిగిందో- తన దివ్యదృష్టితో కనిపెట్టాడు.
“ఓ మదగజమా! పుష్ప ప్రభావమువలన గొప్ప శక్తి నీకు వచ్చింది.
ఇలా విర్రవీగడం నీకు తగదు” అంటూ హెచ్చరించాడు.
కానీ ఆ కరి మౌని పలుకులను పెడచెవిని పెట్టింది.
మౌని క్రుద్ధుడు ఐనాడు.
తన కమండలమునుండి నీళ్ళు దోసిలిలోనికి తీసుకున్నాడు.
“ఓ దంతీ! ఇకమీదట మీ గజ జాతి నల్లగా ఉంటాయి”
ఉరుముతూ అన్నాడు.
అప్పటినుండి ఏనుగుల దేహముల వర్ణము కాస్తా నల్లగా మారిపోయింది.
ఏనుగు గబగబా తన ప్రభువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటూ,
దూర్వాస శాపం గురించి లబలబలాడుతూ చెప్పింది.
దూర్వాస ఋషివర్యుడు వారికి ఒక శివలింగమును అనుగ్రహించాడు.
ఇంద్రుడు “ఈ శివలింగమును భూలోకమునకు తీసుకువెళ్దాము” అంటూ
పాపపరిహారార్ధము భూలోకమునకు బయలుదేరాడు.
అలాగ పృధ్వీతలమున సంచరిస్తూండగా, ఒక చోట వర్షం వచ్చింది.
అలాగ కుండపోతగా వాన కురుస్తూండడం వలన
ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం అసాధ్యమైనది.
కుంభవృష్టిలో పరమేశునికి అభిషేకం జరిగింది.
కైలాసపతి ఆకాశ గంగా జలాభిషేకంతో ఆనందభరితుడౌతూ,
“ఈ స్థలం పవిత్రమైనది. నన్ను ఈ సీమలో ఉంచండి” అని సెలవిచ్చాడు.
అప్పుడు ఇంద్రుడు అక్కడనే శివలింగమును ప్రతిష్ఠించాడు.
ఆ ఊరికి “Aanaiyur” అనే పేరు వచ్చింది.
అరవములో “ఆనై” అనగా ఏనుగు అని అర్ధము.
ఈ ఆలయము Usilampatti అనే ఊరికి దగ్గరలో ఉన్నది.
(thiruvilayadal మహేశుని లీలా విశేషాలతో ఆనైయూరు విలసిల్లుతూన్నది.

తమిళ రాష్ట్రములో సంవత్సరాది,
జనవరి  రెండవ వారములో Thai pongal – వస్తుంది.
తాయ్ పొంగల్ పండుగ ను తమిళ ప్రజలు
ఉత్సాహభరితంగా జరుపుకుంటారు.
(Tamil month of Thai) థై – నెలలో ఈ కోవెలలో,
ఊరులో చక్కని ఉత్సవ సంరంభాలు జరుగుతూన్నవి.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

http://www.sidharism.com
......................................…


 ఏనుగు నల్లన – ఎందుకని?
Published On Saturday, August 20, 2011 By ADMIN. Under:
కథలు, జానపద కథలు. ;
రచన:   కాదంబరి
For kids, ఆగస్ట్ (Link for story)

No comments:

Post a Comment