Friday, February 19, 2010

కొండ గుర్తులు

-
-
-
-
-
-
-
-
-

ఇందీవర నేత్రుడు -
నందన వనమందున
దాగినాడు, వెదుకరే -
వేయి కన్నుల వాడిని-
సాయంగా పిలుచుకునీ ||

మల్లె, చేమంతి, బంతి -
పూ పొదలలోన దాగెనో!? -
పొదరిండ్లలోన మెరయునవే ,
ఆ, సిగ ముడిలో పింఛములు ;;
ఆనవాళ్ళు దొరికెనులే! ||

పారిజాత క్రీనీడలలొ -
యమున అలల వెన్నెలలో
మురళి పయిని మెరయునవే ,-
కొనగోళుల నెల వంకలు
ఆనవాళ్ళు దొరికెనులే! ||

చెణుకులను విసరండీ! - హాస్యాలు ఆడండీ! -
మదన మోహనుడు ,కృష్ణుడు నవ్వగానె
నేస్తులార! మెరయునవే -
పలు వరుసల ముత్తెములు
ఆనవాళ్ళు దొరికెనులే! |

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


కొండ గుర్తులు ;

By kadambari piduri, Jan 16 2010 12:11AM

No comments:

Post a Comment