------------------రేపల్లె పుట్టినింట - ఆ అడుగు దమ్ములెవరివే?ఆ పద పద్మము గరిమలు - స రి గ మ - పద స్వరములే!(అను పల్లవి):::ఆ జాడలు రాధవీ! - కృష్ణాష్టమి నాడు ఇలనుమోహన శ్యాముని చరణ ముద్ర లందునతన " గమనము" గమకములై ఒప్పు తీరు చూడరే! ||1.ముక్కున నత్తున మణులు - పాపిట బిళ్ళల రవ్వలుకాంతులెన్నొ వెద జల్లెను - ఈ చోద్యము చూడరే!-"దొంగ"అనుచు,పట్ట బోవు - వనితలకు చిక్క కుండకన్నయ్యకు దారి చూపు ప్రజ్ఞలే!మన రాధికవి - బహు చమత్కార ప్రజ్ఞలే ||2.తన నడకలే నాట్యాలు! - పెదవి విరుపులేమోవేణువునకు అందించే - సరి కొత్త రాగములే!మురళి ఊదు చున్నాడు- యశోద గారాల పట్టిమన- రాధ చేయి పట్టినట్టి ఘనుడు వీడు!ఔనౌనే! వీడు కాక ఎవరంట? ||Baala ; బాలకృష్ణుని పాల అడుగులు ;; By kadambari piduri, Nov 26 2009 12:20
Thursday, February 4, 2010
బాలకృష్ణుని పాల అడుగులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment