Sunday, February 28, 2010

కార్తీక దీపాలు
























నీదు చివురు వ్రేళులు
వంశీ వేదికపైన - నర్తనములు సేయగా
రాగ మధువు లొలికించుము,
గోవర్ధన గిరి ధారీ! వన మాలీ!||

1.తరగ నురుగులపై -
మణి మయ దీపాలను
వెలిగించెను జాబిలి -
కార్తీకము కాబోలని -
విచ్చేసెను ఋతు రాణి ||

2. నంద వ్రజము ఇటీవల –
ధరణి కుంకుమాయెనని
కనుగొన్నది కొండ గాలి
వేణువును బ్రతిమాలి –
నృత్యములను నేర్చినది ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

కార్తీక దీపాలు

By kadambari piduri, Feb 24 2010 11:34PM

Friday, February 26, 2010

అంజలిదే గొనుమా !
























భక్త శిఖా మణి శ్రీ తిరుమలేశుడు ;
నిఖిలేశుని కనవరతము ;
శత కోటి ప్రణామమములు //

స్వామి పదాబ్జంబుల పూ మంజరి నైతిని ;
రామ చంద్ర ! అభయ వరద! నీ మ్రోలను వ్రాలితిమి
నామ పరిమళమ్ములతో నా మది పూజా సుమము //

అంజలి ఘటియించినాము ; సాష్టాంగము దండము ;
నిరంజన! కృపా మూర్తి!ఒసగుము
నీ అనుగ్రహము ;అది మాకు సుధాంజనము //


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela


By kadambari piduri, Jan 24 2010 12:21AM

ఓ మోహన మురళీ !!!



















"ఆ యమునా తీరాని కవల
ఏమి రవళి? "
(సమాధానము ):::::::
"అది,కన్నయ్య చేతి మురళిది! ||

1.కవల రాగముల నీను -
వేణువులో పిలుపెవరికి?

(జవాబు- ):::::
'ప్రియుని రాక సందియమున ‘
కలవర పడు కోమలాంగి
మాధవ ప్రియ రమణి
రాధికకే - తెలియగా! || -

"ఉలికి పాటు వలదే!
ఓ మానస వంశీ!
నీల మేఘ శ్యాముని అధరమ్ముల
'ఈల పాట - గాలి ఊసులు'
నీ డెందమ్మున సందడించగా
ఇంతటి చకిలిగింతలా!?!!
ఓ మోహన మురళీ!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

గాలి ఊసులు

By kadambari piduri, Jan 11 2010 4:32AM

Thursday, February 25, 2010

అల్లిబిల్లి దండలు















పొగడ పూవుల దండ లల్లి ఉంచాను;
వగల రాయా! క్రిష్ణ! వేంచేయవయ్యా!

సొగసు నీ గళమున సోకు సేయంగ
నగ ధారి! ప్రీతితో అనుమతిని ఈవోయి!

జగడాలు ఈ వేళ, నంద గోపాలా!
మగనాలి వద్దనా? చాలించుమోయీ!

చే వెన్న ముద్దలు శుభ్రంగ తినవయ్య
నీలి సంద్రం పైన శశి రేఖ చిత్రాలు

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

అల్లిబిల్లి దండలు ;

By kadambari piduri, Feb 10 2010 12:46AM

Wednesday, February 24, 2010

పాహి మోహన కృష్ణ!























పాహి మోహన కృష్ణ!
పాహి మహిమా మూర్తి!
పాహి మహీ వల్లభేంద్రా! ||

ఇహమునందు, పరమునందున
అహరహము శ్రీ నామము - నకు
జిహ్వ పుణ్యనిలయ మాయెనొహో ! ||

నాకాధిరోహణమునకు
ఎన్నగాను నామ జపము
ముమ్మొదటి సోపానమురా! ||

అహోరాత్రములు మనము
శ్రీ వేంకట రమణు భక్తి -
విమల సరసునందుననే తానమాడును ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

పాహి మోహన కృష్ణ!

By kadambari piduri, Jan 19 2010 1:50AM

గైకొనుమా హారతి! పద్మావతి
























సకల కళా భూషిత
కల వాణీ! పద్మావతి!
గైకొనుమా హారతి ||

సప్త గిరుల స్వామికి
అనురాగపు దేవేరివి
మీ ఇరువురి దర్శనముల
తరియింతురు భక్త కోటి ||

శరణు కోరి నీ దరిని
చేరిన శిశువులము తల్లి!
వత్సలను లాలించి
పాలించుట నీ ఫణితి ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


పద్మావతి ;

By kadambari piduri, Feb 16 2010 3:39AM

వెన్నెల కోలాటం
























1)రాస లీలల రాసవిహారి
భాసురమ్ముగా ఆడేను
బృందావనిలో కోలాటములు
టక్, టక్ , టిక్ టిక్ ||

2) దిన మణి ప్రభాత కిరణాలు
మణి హారములలొ ;
చేరేను నేరుగా!

కుందన హరిద్ర చేలాంచలములలో
శరత్ చంద్రికలు
కొంగుల బంగారమ్మాయె ||

3) ఆడే నేస్తుల దరహాసాలు
తండోప తండములు పరిహాసాలు
నవ రస భావములందున నేడు
హాస్య రసములకు ఘన సన్మానాలు ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

వెన్నెల కోలాటం ;

By kadambari piduri, Feb 10 2010 1:13AM

చిత్రపటం















భక్త జనులు ఎల్లరు
పూజలను చేసేరు ||

( అను పల్లవి ) ;;;;

అత్తరు పన్నీరుల
నెత్తావు సుమ దళములతో ,
మనసారా కరి వరదా!
నీ పూజలను చేసేరు
భక్త జనులు ఎల్లరు ||

1. విరి చంద్రుడు మార్చేను
కరి వరదా! శ్రీ రమణా!
నీదు – చరణ ముద్ర లిపుల తోటి
ధరణి పద్య కావ్యమాయె ||

2.నీ గమనము నాట్యము
వీక్షణముల వర్ణ మాల
కరి వరదా! శ్రీ రమణా!
ఇలతొ గాలి పోటీగా
చిత్ర వర్ణపటము ఆయె ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Kovela

చిత్రపటం ;

By kadambari piduri, Feb 14 2010 12:27AM

Monday, February 22, 2010

ఏడు వారాల పేర్లు
























ఆ వారం, ఈ వారం, ఇది ఎవ్వారం!?
హరి విల్లు రంగుల్లా వరుసగా ఏడు;

ఆది వారం , భౌమ్య వారం;
మామిడి అల్లం! రావోయీ!

"సండే ( sun Day) సెలవు,మల్ల గుల్లాలు;
మా కుటుంబీకులు రారోయీ!"

"సోమ వారము నోములు మా ఇంట;
ఘాటు శొంఠీ! రావోయీ!"

"మండే ( mon day) మత్తు,తిమ్మిరి, బద్ధకము
ఇపుడు కాదులే, ఇంకో సారి!"
"మంగళ , బుధలు; మంచి నోములు;
ఏలకు, లవంగం రారండీ!"

"Tues Day, Wednes లు; చుట్టాలు మా ఇంట;
కుదరరదు, మన్నించు!
గురువారం నాడు మా మహలు ఇంటికి
గురువులు వత్తురు, కాన రామోయీ!"

"శుక్ర, శని వారాలందు;
పిక్నిక్కు; ఉపహార పార్టీ, తప్పక రండి!"

"వెన్నెల విందులు, వన భోజనమ్ములు;
ఫ్యామిలి మెంబర్సు, హితులు, బంధువులు,
కలిసి కబుర్లు, వినోదపు ముచ్చట్లు;
ఆప్యాయతలతో మీదు ఆహ్వానం,
వెలుతురుల నిచ్చేటి స్నేహ దీపమ్ము !"

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Baala

ఏడు వారాల పేర్లు ;

By kadambari piduri, Feb 10 2010 12:25AM

తేనె మధురిమలు
























తుర్ర్ తుర్ర్ తూరీగ
జోర్ జోర్ జోరీగ
చెవిలో దూరితె గుయ్ గుయ్ బాబోయ్ !
కుర్ర్ కుర్ర్ కందిరీగ
కుడితే అమ్మోవ్ !

"తూరీగ తోకకు దారాలు కట్టి
ఇంచక్క గాలిలొ ఎగరేస్తానమ్మా!"

"తప్పు తప్పు బాలలూ!
హింస చేయ కూడదు ,
తీపి మధువు లీయండి, ఓ తేనె టీగలూ!
తేనె మాధురినీ గ్రోలండి,పిల్లలూ !
ఆరోగ్య వర్ధని ,చురుకు , బలము లిచ్చును
ఆటలూ పాటలూ, చదువు సంధ్యలన్ని నేర్చి
అందరికీ ఆనందములను చేకూర్చండి!"

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Baala

తేనె మధురిమలు ;

By kadambari piduri, Dec 15 2009 5:50AM

Friday, February 19, 2010

కొండ గుర్తులు

-
-
-
-
-
-
-
-
-

ఇందీవర నేత్రుడు -
నందన వనమందున
దాగినాడు, వెదుకరే -
వేయి కన్నుల వాడిని-
సాయంగా పిలుచుకునీ ||

మల్లె, చేమంతి, బంతి -
పూ పొదలలోన దాగెనో!? -
పొదరిండ్లలోన మెరయునవే ,
ఆ, సిగ ముడిలో పింఛములు ;;
ఆనవాళ్ళు దొరికెనులే! ||

పారిజాత క్రీనీడలలొ -
యమున అలల వెన్నెలలో
మురళి పయిని మెరయునవే ,-
కొనగోళుల నెల వంకలు
ఆనవాళ్ళు దొరికెనులే! ||

చెణుకులను విసరండీ! - హాస్యాలు ఆడండీ! -
మదన మోహనుడు ,కృష్ణుడు నవ్వగానె
నేస్తులార! మెరయునవే -
పలు వరుసల ముత్తెములు
ఆనవాళ్ళు దొరికెనులే! |

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


కొండ గుర్తులు ;

By kadambari piduri, Jan 16 2010 12:11AM

పదండి ముందుకు !

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

ఆమని పందిరి
అది సప్త గిరి ;
పద!పద!"మంటూ
పందెం వేసుకు
నడువు ముందుకు ||

1.ఫదములు తక థిమి
అడుగులు సాగగ
దడ బిడ లెందుకు?
పదవోయ్ ముందుకు!
అదిగో తిరుమల !

2.పదములు రిమ ఝిమ –
పెదవుల తొణకగ –
డెందము నిండుగ
నామం పలుకగ –
“గోవిందా!”అని =

3."పదమని,పదమని
"పద! పద!" మంటూ
పెద్దలు, పిన్నలు
తొందర సేయుచు
అదిగో తిరుమల ;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

పదండి ముందుకు !

By kadambari piduri, Jan 12 2010 11:00PM

గొబ్బి దేవుళ్ళు


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-

పరిమళాలు జాల్వారే ఝరుల విరుపులే
తిరుమలేశు పరిహసించు పద్మావతి నవ్వులే!

2. అలతి అలతి పొడుపు కథలు
వేసినది పతికి పొలతి, పద్మావతి

3 . ముడిని విప్పలేక ,కథల గుట్టు చెప్పగా లేక
మల్ల గుల్లాలు ,ఒకటే తికమకలౌతూన్నాడె తిరుమలేశుడు
సతమతమౌ నాథుని గని,పద్మావతి పెదవులపై కిల కిలల నగవులు ||

4 . “ తన జారు కురుల ముడి వేయుట ఏలాగో తెలుసు గాని;
తమకు – పొడుపు కథల మూలమేదొ తెలియదెలా? ఏమి సేతు? ”
మెర మెచ్చుల మాటలలో దిట్ట గదా,తమర”నుచూ
గల గలల హాస్యాలు, పొలతి చమత్కారాలు ||

5 . నీల మోహనాంగుడు సతి ప్రజ్ఞల తెల్ల బోయెనే!
“ ఇపుడే తొలి పొద్దు పొడిచెనిదే వింతగా! అహహా”
ముసి ముసి దరహాసాలు -పద్మాధరములపయిన ||

6. ఉపవీతముతో సతీ సూత్రమ్ములు పెనవడగా
తడబాటులు మరచిపోయి,స్వామి నవ్వెవే!

“నా ఎద పయి మీ లాసములు
శృంగార విలాసములు;
అవి –
సంకురాత్రి ముగ్గు మీది గొబ్బిదేవులు!”
అని హసించి, దేవేరి భక్తి మ్రొక్కెను
ఈలాగున , భక్తులకు ; వనరైన గాథ నొసగె !!!!!!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

గొబ్బి దేవుళ్ళు

By kadambari piduri, Jan 12 2010 1:34AM

రామ లాలి... మేఘశ్యామ లాలి

-
-
-
-
-
-
-
-
-
-
-
-
ఊపండి, ఊపండి ఉయ్యాలలు ;
పాడండి, పాడండి జోల పాటలు ||
1.ఉయ్యాల తొట్టిలో ఉంగ ఉంగా అనుచు ;
జానకి పవళించె ,
ఊపవమ్మా జనక మహరాజ పత్నీ! ||
ఛిన్నారి తల్లికి సిరి తిలకమెట్టి
కన్నుల కాటుకలు ఇంపార తీర్చి
గాజుల రవళులు జావళీ వినిపించ
కనకంపు హారాలు నాట్యాలు సాయంగ
ముస్తాబు చేయండి,ఇంతులార! ||

గోరింట బొమ్మలు అరిచేత – నవ్య
హరి చందనాలను మేనెల్ల అలది
శ్రీ చందనాలను దివ్యంగ పామి, అతివలూ! ||

గంధాలు అంతంత మెత్త బోకండీ!
శ్రీ రాఘవులు కలలోన గాంచి
మనసులో ఎంతెంతొ నొచ్చుకుంటారు
లక్ష్మణుడు ధ్వజమెత్తి, ఉరికి వస్తాడు
భరత, శత్రుఘ్నులు ఊరుకోరండీ!
కౌసల్య,సుమిత్ర,కైకేయి అత్తలు
తర్జనిలు చూపించి,హెచ్చరిస్తారు ;

గంధాలు అంతంత మెత్తకండి!
గోరంత గంధము ఘుమ ఘుమలు కొండంత;
చిటికెడు గంధము - సిరి సంపదల్లు హిమ శృంగమెత్తు;

చిటి పాప చిరు నవులు, గాలికి దొరికెను గొప్ప కొల బద్దలు ;
మిథిలా పురి నుండి – అయోధ్యా నగరికి
ఎంత దూరం ఉందొ –
మలయ పవనములార! కొలిచి చెప్పండి!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


Baala


By kadambari piduri, Feb 5 2010 5:09AM

Monday, February 15, 2010

పడమటి సంధ్యా రాగం


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-


పిబరే రామ రసం ;
============

పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
జనన మరణ భయ శోక విదూరం - 2 - ఆ||

సకల శాస్త్ర నిగమాగమ సారం
పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
శుద్ధ పరమ హంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీఠం - 2 - ||

పిబరే రామ రసం
రసమే పిబరే రామ రసం

===================================
తెలుగు చలన చిత్రము : పడమటి సంధ్యా రాగం
singers : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ

Sunday, February 14, 2010

రామ లాలి... మేఘశ్యామ లాలి

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-


ఊపండి, ఊపండి ఉయ్యాలలు ;
పాడండి, పాడండి జోల పాటలు ||

ఉయ్యాల తొట్టిలో ఉంగ ఉంగా అనుచు ;
జానకి పవళించె ,
ఊపవమ్మా జనక మహ రాజ పత్నీ! ||

ఛిన్నారి తల్లికి సిరి తిలకమెట్టి
కన్నుల కాటుకలు ఇంపార తీ
ర్చిగాజుల రవళులు జావళీ వినిపించ
కనకంపు హారాలు నాట్యాలు సాయంగ
ముస్తాబు చేయండి,ఇంతులార! ||


గోరింట బొమ్మలు అరిచేత –
నవ్యహరి - చందనాలను మేనెల్ల అలది
శ్రీ చందనాలను దివ్యంగ పామి,

అతివలూ! ||

గంధాలు అంతంత మెత్త బోకండీ!
శ్రీ రాఘవులు కలలోన గాంచి
మనసులో ఎంతెంతొ నొచ్చుకుంటారు
లక్ష్మణుడు ధ్వజమెత్తి, ఉరికి వస్తాడు

భరత, శత్రుఘ్నులు ఊరుకోరండీ!
కౌసల్య,సుమిత్ర,కైకేయి అత్తలు
తర్జనిలు చూపించి,హెచ్చరిస్తారు
;గంధాలు అంతంత మెత్తకండి!

గోరంత గంధము ఘుమ ఘుమలు కొండంత;
చిటికెడు గంధము - సిరి సంపదల్లు హిమ శృంగమెత్తు;
చిటి పాప చిరు నవులు,
గాలికి దొరికెను గొప్ప కొల బద్దలు ;
మిథిలా పురి నుండి – అయోధ్యా నగరికి
ఎంత దూరం ఉందొ – మలయ పవనములార! కొలిచి చెప్పండి!

రామ లాలి... మేఘశ్యామ లాలి

By kadambari piduri, Feb 5 2010 5:09AM )

శంపా లత సామ్రాజ్ఞి

-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-

సౌదామినీ లతా మహా రాణులు
లాఘవంగా
మేఘ మాలికల భుజాల పైన వాలి
సోయగాల ఆటలు ఆడుతూ
కేరింతలు కొడుతున్నాయి;
ఇంద్ర ధనుసు సప్త వర్ణాలు
జలపాతపు నురుగుల నవ్వుల మీదికి
దూకి, ఇంద్ర జాలాలు చేస్తున్నాయి;
ఇంత మనోజ్ఞ దృశ్యాలను
నా హృదయ యవనికపై చిత్రిస్తూ
నా నయన ద్వయిలో
నిక్షిప్తమొనరించుకుని
ఇపుడు వెలువరిస్తూన్న
"కువలయ సౌరభ దృక్కులకు"
జోహార్లు, జోహార్లు, ధన్య వాదాలు.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

మురిపాల కన్నయ్య


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-


మేలుకో! మేలుకో! మేలుకోవయా!
మురిపాల కన్నయ్య!
నిన్నింతగా మేము - మేలు కొలపాలా! ||

నిదుర మబ్బుల నిరత సంచారములు సేసి
నాకమున దివిజులకు - బంగారు కలలెన్నొ
మెలకువగ పంపిణీ చేయు చున్నావా!?! ||

నీలాంబరములలో సర్వదా ఓ స్వామి
అలుపు సొలుపెరుగక చేయు చున్నావు గద
విశ్వమ్ములందు - క్రీడా విహారములు ||

విలాసములు , విహరణలు - చాలు లోకేశా! -
పృధ్విలో ఉన్నాము - నీ భక్తు లెల్లరము
నీ స్వర్ణ స్వప్నాలు -
పక్ష పాతము మాని - పంచుమా ఎల్లరికి ||

Baala - మురిపాల కన్నయ్య ; -

By kadambari piduri, Dec 27 2009 6:25AM

Thursday, February 11, 2010

కమ్మని స్వప్నాలకు భరోసా


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
కుందేలమ్మ! కుందేలమ్మా!
నువు – బాల, పెద్దలకు ఇస్తావా?
కమ్మని కలల భరోసా!

2.వాతావరణం కాలుష్యం
ఓజోన్ పొరలకు తూటు – బిలం
ప్రకృతిలోన బీభత్సం కలుగునంటగా,ఇదేం ఖర్మం ?

3.జాబిలి ఒడిలో నువు చేరి
వెన్నెలమ్మకు ధైర్యం చెప్పు!
రవంత ధైర్యం నువు ఇస్తేను
పృధ్వికి హరితం దరహాసం!

ప్రజలందరు నిను పొగడెదరమ్మా,
“నీ చొరవతొ విశ్వము కల కాలం
కళ కళ లాడుతు మన గలుగునని ! "

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Baala

By kadambari piduri, Jan 23 2010 7:52AM

చిలక వంకర ముక్కు


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

అనగనగా ఏడుగురు రాజ కుమారులు చేపలను పట్టడానికి బయలు దేరారు.........."
ఈ కథ ఆంధ్ర దేశములో దాదాపు అందరికీ సుపరిచితమైనదే!
రా కుమారులు ఎక్కడైనా సింహాలనూ, పులులనూ వేటాడ్డానికి వెళతారు గానీ,చేపల్ని పడతారా? "
అంటూ ఈ కాలపు సిసింద్రీలు అడుగుతారు .
దీంట్లోని అసంబద్ధత గురించిన తర్క మీమాంసలను కాస్సేపు అసంటా పెట్టేసి, రవంత యోచించండీ;
ఈలాంటి " గొలుసు (link) కథల వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
అనేక పాత్రలను ఉంచడము, లింకు సంభాషణలు , అమితమైన ఆసక్తిని కలిగిస్తాయి.
పిల్లల జ్ఞాపక శక్తిని ఇనుమడింప జేస్తాయి ఇవి.
ఇదిగో! అలాంటి కథ ఈ దిగువన చదివి, ఆనందించండి.


( kRtaj~natalatO )

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో రామచిలక, చీమా మంచి స్నేహితులు.
ఒకసారి చిలక పుట్టిన రోజు వచ్చింది.
చిలక తన స్నేహితులందరినీ సాయంత్రం టీ పార్టీకి ఆహ్వానించింది.
తన ప్రాణ స్నేహితురాలయిన చీమని
"అందరి కంటే త్వరగా రావోయీ, చీమ మిత్రమా!" అంటూ, రమ్మని పిలిచింది.
చీమ అందరి కంటే త్వరగా చిలక ఇంటికి వెళ్ళింది.
చిలక గారెల పిండి రుబ్బుతూ ఉందప్పుడు.
చీమ వెళ్ళి " నేనేమి పని చేయాలో పురమాయించ"మంది.
చిలక " పొయ్యిమీద పాయసం పెట్టాను; కాస్త చూడమనేసరికి
చీమ గరిట పుచ్చుకుని పొయ్యి మీదకెక్కి గిన్నెలో పాయసం ఉండుకుతుంటే తొంగి చూసింది.
అలా చూస్తూ ఉన్నప్పుడు జారి అందులో పడిపోయింది. పాపం! ఆ వేడికి మరుగుతున్న పాయసంలో పడి చచ్చిపోయింది.
చాలా సేపయిన తరువాత చిలక వచ్చి చూసేసరికి పాయసంలో పడి చీమ ఉడుకుతూ కనపడేసరికి చిలక ఎంతో విచారించింది. తన ముక్కుతో అందులో పడ్డ చీమని బయటకు తీసింది.
ఆ వేడికి చిలక ముక్కు వంకర పోయింది.
బాధతో చిలక ఎగురుకుంటూ బయటకు వెళ్ళింది. చెట్టు మీద ఉన్న కాకి ఎగతాళి చేస్తూ "ఏమిటి చిలక బావా! నీ ముక్కు అలా వంకర పోయింది ." అని అడిగింది.
అప్పుడు చిలక" ఏం చెప్పమంటావు కాకి బావా! పాయసం లో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ, కాకి కన్ను లొట్ట బాయ "' అనేసరికి కాకికి ఒక కన్ను పోయింది.
కాకి ఒంటి కన్నుతో తను రోజూ వెళ్ళే రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది.
రావి చెట్టు "ఏంటి సంగతి ?" అంటే కాకి
"ఏమి చెప్పమంటావు; పాయసంలో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ,కాకి కన్ను లొట్ట బాయ, రావి చెట్టాకులు రాలి పాయ " అంది.అంతే రావి చెట్టాకులన్నీ రాలి పోయాయి.
రోజూ రావిచెట్టుకింద కూర్చునే ఏనుగు ఆరోజు అక్కడికి వచ్చి ఆకులన్నీ రాలిపోయి ఉండటం చూసి చెట్టుని అడిగేసరికి రావిచెట్టు ఇలా చెప్పింది, ' "పాయసంలో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ,కాకి కన్ను లొట్ట బాయ, రావి చెట్టాకులు రాలి పాయ ఏనుగు తొండం వెనక్కు పాయ " అనేసరికి ఏనుగు తొండం కాస్తా వెనక వీపుకి అతుక్కు పోయింది.
ఏనుగు నీళ్ళు తాగుదామని ఏరు దగ్గరకి వెళ్ళింది.
ఏరులోని నీళ్ళు ఏనుగు తొండం చూసి నవ్వితే ఏనుగు కధంతా చెప్పి....
"ఏటిలోని నీళ్ళు ఎండ బాయ " అంది.అంతే చుక్క నీళ్ళైయినా లేకుండా ఏరు ఎండిపోయింది.
రొజూ నీళ్ళ కోసం వచ్చే ఏడుగురు కోడళ్ళు ఆరోజు కూడా అటుగా వచ్చి ఎండిపోయిన ఏరుని చూసినివ్వెరపోయారు.
అప్పుడు ఏరు కధంతా చెప్పి, " ఏడు కోడళ్ళ తల మీద బిందెలు అతుక్కు పాయ " అంది.
అంతే !ఎంత ప్రయత్నం చేసినా ఆ బిందెలు రాలేదు.
కోడళ్ళు ఇల్లు చేరారు. వాళ్ళ అత్తగారు మావగారికి కంచంలో గరిటతో అన్నం వడ్డిస్తోంది. ఎంతసేపైనా బిందెలు కిందకి దించని కోడళ్ళని చూసి, అత్తగారు "ఏమిటే ఎంతసేపు మోస్తారు, ఇక బిందెలు దించండర్రా !" అంది.
కోడళ్ళు కధంతా చెప్పి,"అత్త చేతి గరిట అతుక్కు పాయ" అన్నారు;
అంతే! అత్త చేతి గరిట అలాగే ఉండిపోయింది.
కాసేపయ్యాక మావగారు వచ్చి పీట మీద కూర్చుని అన్నం తినడం మొదలెట్టాడు.
ఎంతసేపైనా భార్య గరిట వదలక పోవడం చూసి " సంగతేంట"ని అడిగేసరికి
అత్త కధంతా చెప్పి,"మావ కూర్చున్న పీట అతుక్కు పాయ!" అంది;
అంతే! కూర్చున్న పీట ఒంటికి అతుక్కు పోయింది.
కొట్టుకి అలాగే పీటతో సహా వెళ్ళిన సేటుని చూసి, కొట్టుకి వచ్చిన జనాలు అడిగే సరికి
సేటుగారు "పాయసంలో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ,కాకి కన్ను లొట్ట బాయ, రావి చెట్టాకులు రాలి పాయ, ఏనుగు తొండం వెనక్కు పాయ,ఏటిలో నీళ్ళు ఎండ బాయ, ఏడు కోడళ్ళ బిందెలు అతుక్కు బాయ,అత్త చేతి గరిట అతుక్కు బాయ,మావ కింద పీట అతుక్కు పాయ, రోడ్డు మీద జనం అతుక్కుబాయ ' అన్నారు.
అంతే! ఎక్కడి వారు అక్కడే అతుక్కు పోయారు.
కాసేపటికి ఆ రోడ్డు మీదకి ఒక సాధువు వచ్చారు.
తన దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నారు.
ఇదంతా ఏదో శాపం వల్ల ఇలా జరిగిందని చెప్పి, తన మంత్రశక్తితో అంతా చక్కదిద్దారు.
కానీ ......
"దానిని తాకిన వంకర పోయిన చిలక ముక్కుని సరి చేయడం వీలు కాదని"
సెలవిచ్చి వెళ్ళిపోయారు.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


Thursday, February 4, 2010

బాలకృష్ణుని పాల అడుగులు


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

-
-
-
-


రేపల్లె పుట్టినింట - ఆ అడుగు దమ్ములెవరివే?
ఆ పద పద్మము గరిమలు - స రి గ మ - పద స్వరములే!

(అను పల్లవి):::
ఆ జాడలు రాధవీ! - కృష్ణాష్టమి నాడు ఇలను
మోహన శ్యాముని చరణ ముద్ర లందున
తన " గమనము" గమకములై ఒప్పు తీరు చూడరే! ||

1.ముక్కున నత్తున మణులు - పాపిట బిళ్ళల రవ్వలు
కాంతులెన్నొ వెద జల్లెను - ఈ చోద్యము చూడరే!-

"దొంగ"అనుచు,పట్ట బోవు - వనితలకు చిక్క కుండ
కన్నయ్యకు దారి చూపు ప్రజ్ఞలే!
మన రాధికవి - బహు చమత్కార ప్రజ్ఞలే ||

2.తన నడకలే నాట్యాలు! - పెదవి విరుపులేమో
వేణువునకు అందించే - సరి కొత్త రాగములే!
మురళి ఊదు చున్నాడు- యశోద గారాల పట్టి
మన- రాధ చేయి పట్టినట్టి ఘనుడు వీడు!
ఔనౌనే! వీడు కాక ఎవరంట? ||

Baala ; బాలకృష్ణుని పాల అడుగులు ;; By kadambari piduri, Nov 26 2009 12:20

పాల వెన్నెల శిల్పాలు

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-


ఈ రేయి బోసిగా ఉన్నదీ? ఎందుకని?
విశ్వ కర్మకు ఉలి చేతిలో లేదనుచు ఉలికి పాటు!
మయ బ్రహ్మకు ఎంతో తటాపటాయింపు ;
అందుకేనండీ !

బాలల చిరు మందహాసముల పసిడి ఉలులు,
ఇవిగో! దొరికెనండీ!

అంచెలంచెలుగా,
ఆ కాంచనపు ఉలులతో
విదియ నెల వంకగా ఆరంభమై
నిండు పున్నమల నిట్టె తీర్చిదిద్దేను

అమోఘము కదటండీ -
చల్ల చల్లనీ
ఆ శీతల చంద్రికల అద్భుత శిల్పములు !

Baala ; పాల వెన్నెల శిల్పాలు ;

By kadambari piduri, Dec 5 2009 6:30AM

సందేహాలు


-
-
-
-
-
-
-
-
-
-
-
-


ఆలించ వోయి వేంకటేశ!
అతివ అలివేల్మంగకు
సందియములు వేల వేలు
తీర్చు - సందర్భమిదియె!
నిలు నిలువో, నిలువుమోయి! - 2 ||

ఇందు ముఖితొ సుందరమౌ
మేటి - చతురు లాడుటలో,
స్వామి! నీకు నీవె సాటి! ||

వనజ పాణి పద్మావతి
వేలి స్వర్ణ ఉంగరాల
మెరయు రవలు, మణులు,
నవ - రత్న,మాణిక్యములు ||

అంగుళీయకము లిటుల
మర - కతములై తోచగా
అచ్చెరువుల తరళాక్షుల
విపుల చర్చలు ||

శ్యామ లాంగ మాధవుని
చిత్ర రూపు వన్నియల
ప్రతిఫలనములు భాసిల్లిన
మేల్మి- సంఘటనల
గుచ్ఛములే గుబాళింపులే ! ||

Kovela ; సందేహాలు ;
By kadambari piduri, Dec 5 2009 12:04PM