
ఆవాహనగా ఆహ్వానితమై ;;;;;
'''''''''''''''''
నీ దృక్కుల ధరణీ సుక్షేత్రంలో;
మృదు మంజుల గేయములుగ మొలకలెత్తి;
పచ్చ పచ్చని పైరుల చిరు నవ్వుల సందడిగా,
నా హృదయములోనికి దూరి
చేసిన ఈ గాయాన్ని చూడు!
కలల బరువును మోయలేక;
కర్ణుని రథంలా కుంగి పోతూన్న;
ఈ గాయాన్ని చూడు!
'నీవు బాధ పడతావేమో'అని;
"తానే ఒక పులకింతగా మారి పోయిన"
ఈ గాయాన్ని చూడు!
ఈ గాయం;
ప్రేమ తత్వానికి "సింహ ద్వారం".
ప్రేయసీ!
నువు చూడ దలుచుకున్నప్పుడే చూడు!
ఈ లోగిలిలో,
నా పర్ణ కుటీరంలో;
ప్రతిష్ఠితమైన ప్రేమ తత్వపు కాంతి
నీ చూపులలోనికి తిరిగి ఆవాహన అవుతుంది.
అపుడే కదూ,
ఆ ఆహ్వానిత శ్వేత కాంతి
సప్త వర్ణాలనూ
ప్రస్ఫులించే
మనోజ్ఞమైన
ఇంద్ర ధనువుగా
ఎట్టెదుట సాక్షాత్కరిస్తుంది.
No comments:
Post a Comment