
''''''''''''''''''''''''''''
నీవు లేక కలలు రావు;
స్వప్న రహిత శూన్యమై;
నాదు నిదుర కాస్తా ;
మూగ వోయినది;
ముసురుకోనీయి చెలీ!
నీదు ముంగురులలొ
వాలిన తేటులకు
గట్టి పోటీని ఇచ్చును నాదు కలలు!
కనుకనే,
నాదు జీబురు నిదుర చుట్టూతా ;
నిను గురించిన తీపి స్వప్నాలను
ముసురు కోనీయి,చెలీ!
ముసరనీయి!
'''''''''''''''''''''''''''''''''''
No comments:
Post a Comment