Thursday, May 14, 2009
ఊర్మిళా దేవి నిద్ర
'''''''''''''''''''''''''
ఊర్మిళా దేవి నిద్ర ;;;;;;
'''''''''''''
లక్ష్మణ స్వామి తన భార్య ఊర్మిళా దేవిని అయోధ్యలో ఉంచి,తాను అన్న గారి వెంట అడవుల కేగినపుడు ఆమె కన్న తల్లి దండ్రుల భావాల అల్జడికి "పాట రూపము ఇది.
పాట ;;;;;;
''
1)నిదుర పోవే ఊర్మిళా!నిదుర పోవమ్మా!
లాలి లాలి లాలీ జో!
మా కన్న తల్లీ!ఊర్మిళా!//
2)కడుపులోన నిన్ను దాచి
తొమ్మిది మాసములు మోసి
కన్న బిడ్డా!నిన్ను మేము
కన్నాముర,చిట్టి తల్లీ!
కను పండుగ పొంగి పోతూ
పాడినాము,హాయి!హాయీ!ఆయిరారో!
జో జో జో లాలి అనుచు //
కన్ను దోయి ఊయెలలో నిను
పొదివినాము,పెంచినాము
పసిడి తల్లీ!,ఊర్మిళా!
ఊర్ముమా!ఉయ్యాల!అనుచు //
3) 'లాల ' పోసి లాలించినాము
లాలనలలో లావణ్య రాశీ!
లాస్యమే నీ బాల్యమాయెనులే!
లాలిత్యమే నీ జీవితమునకు
ప్రతి రూపమగునని తలచినాము
హాయి!హాయి!జో హాయీ!
నాడు లాస్యమే నీ బాల్యమాయెను
నేడిటుల,నీ వదనమందున
దర హాసమీ చొప్పున మాయమాయెనుగా!
4)పువుల పదములు అలలు అలలై
నీ దోగాడు పదముల
మెత్తలైనవి
జో లాలీ జో లాలీ! //
వనము లందలి విభుని పదముల
కంటకములు తగులునేమొ!"యని
ఇచట నీవు కుందు చుంటివి
పరమ సాధ్వివి నీవు ఐతివి
కన్న తల్లీ!లాలి! జో జో! //
5)కాననముల కదలుచున్న
కాంతు తలచీ
తలచి తలచీ
"నిదుర నందున
నీదు కలలే
'కావ్యములుగా వెలయు జగమున! '
నిదురయే
'నీ బ్రతుకు 'అయిన
విధి విలాసము నేమి అందుము?
కుమిలి పోతూ,కుమిలి పోతూ
నిను కన్న వారము,
పాడు తుంటిమి,అమ్మలూ!
చిన్న బోయిన మానసములతో
జోల పాటలు,లాలి పాటలు
జో జో జోలాలీ!
ఆయిరారో! హాయిలాలో! //
'''''''''''''''''''''''''''''''''''
'''''''''''''''''''''''''''''''''''
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment