Thursday, May 14, 2009

అవధి లేని ఆశ్చర్యములు










అవధి లేని ఆశ్చర్యములు ;;;;;;
'''''''''''''''''''''''


సాకినది యశోద మాత
తన ఒడియే 'మధుర 'గ
తన ఒడియే విశ్వ రోదసిగ
కదరా! కన్నా!

'''''''''''''''''''''''''''''''

2)నీ కంటికి కాటుక తీర్చిన వెనుక
తన వేలిని కనుగొని మురిసినది!

"నీలి కలువగా విరిసినదీ
ఈ నా అంగుళి!"

అనుచూ తలచి
పదే పదే
ఇరుగు పొరుగులకు చూపించీ.

''''''''''''''''''''''''''''''''''

3)నీ మేనుకు కస్తూరి పూసినంతనే
అఱ చేతులను"గుప్పు"గ ముడిచినది

రోదసిలోని గోళములన్నీ
తన అఱ చేతులలోనే కన్నది,కన్నా!

ఆ సంభ్రమాశ్చర్యమ్ముల నుండీ
మరల ఎప్పటికి
తేరుకొనునో ఏమో?!
మన లోకమునకు
వచ్చే దెపుడో.ఏమో?!!!!!!


''''''''''''''''''''''''''''

No comments:

Post a Comment