
'''''''
పలుకుల సుధల తీపి ;;;;;;;;;
'''''''''''''''''
పోకిరీల కోతి బావ
పోకడల కొండ ముచ్చు
ఇవి చాలమ్మా!నాకు-
ఆడు కొందు నించక్కా! //
2)సొగసు రామ చిలకలు-సితా కోక చిలుకలు
నా కన్నులలో వన్నియల-నాట్యాలు ఎన్నెన్నో! //
3)హరివిల్లుకు,వెన్నెలకూ-మెరుపులకు,ఉరుములకూ
సంధి నేను కుదురుస్తా-ఆటలెన్నొ నేర్పిస్తా! //
4)కుహు కుహూ కోయిలల-మైనా,గోర్వంకల
పలుకు రాగాలలోన - తీపి ఎలా కలిగెనమ్మా?
అమ్మ ఆన్సరు ::::::::
''''''''
"మీ చిన్నారుల తొక్కు పలుకు -
సుధలు చిన్ని బొట్టు చాలును
గ్రోలినందునే
'వాని ,పాట తీపి పొంగా'యెను.
ఆడండీ!పాడండీ! -
ఆట పాటలతొ,మేటిగ
విద్యలన్ని నేర్వండీ!
మీ చిలిపి చేతల సౌరభాలు -
ఎల్లెడలా నిండాలి
కల్మషాలు లేని జగతి -
మోద భరిత బృందా వని!"
'''''''''''''''''''''''''''''''''''
No comments:
Post a Comment