
''''''''''''''''''''''''''''''''''''''
''''''''
తరుణి చూపులు ;;;;;;;
'''''''''''
పరమ పద సోపాన పటమును పరిచేసాయి
"ఉవిద చూపులు!
క్రితం క్షణం దాకా
నిదుర మత్తులో జోగుతూన్న
"వలపు" కాస్తా
ఒక్క ఉదటున
మగత నిద్ర మత్తును వీడి
రంగములోనికి జొర బడినది
నిచ్చెనలను ఎగ బ్రాకుతు ఎక్కినా
తోకకు దిగ జారినా
ప్రణయ క్రీడా కారులదే గెలుపు!
నిశ్శ్రేణులైనా,
జంతు విక్రీడితాలైనా
నవ్యత్వము పొందుతాయి
"ప్రేమ రచన"లో!
'''''''
No comments:
Post a Comment