Monday, May 18, 2009
నాది,నా అనేది !
''''''''''''''
నాది కానిదేది లేదు నీలో ;
నిజానికీ నేనున్నది నీలో :::::::
'''''''''''''''''''
1)జంబులింగం పుత్రరత్నానికి డిక్టేషను చెబుతూ,
హోం వర్కు చేయిస్తున్నాడు.
తండ్రి ప్రశ్న ::::
''''''''
"నానీ!
'నా నాలిక మీద నానా రాగములు చిటికెలో మధురంగా విడుదల అవుతాయి;'
ఆ! ఇప్పుడు ఈ సెంటెన్సులో ఎన్ని "నా"అనే అక్షరాలు ఉన్నాయి?చెప్పు! "
తనయుని వాక్కు :::::::
'''''''''''
"ఇక్కడ 'నా'అనేది ఏదీ ఉండదు:
'విడుదల 'అసలే లేదు,అంతా అమ్మే కదా మరి!"
''''''''''''''''''''
2)"అమ్మ"కం దారులు ;;;;;;;
'''''''''''''
ఇచ్చట నాన్నలు అందరూ
"కొడుకులు అండ్ కో"లు" :
"కూతురులు 'కూత కొచ్చిన పిట్టలు;
మరియు పెళ్ళి అవగానే 'తుర్రు 'మనే బుర్రు పిట్టలు."
'''''''''''''''''''''''''''''''
3)"మన బాసు కథాకళీ చేస్తున్నాడు!"
"ఎం?ఎందుకనీ?" ఛాంబరులోనకు తొంగి చూస్తూ
అడిగాడు జంబు లింగం.
బాసు వీరంగం కనిపిస్తూ,వినిపిస్తూన్నది ఇలాగిలాగిలాగ ;;;;;;
"కావాలనే ఇలా టైపు చేసావు నువ్వు....."
కొత్తగా జాయిను అయిన లేడీ టైపిస్టు వినయ,విధేయతలతో తల వంచుకుని,
ఆయన ఎదురుగా నిలబడి ఉన్నది,అందరికీ ముసి ముసి నవ్వులను తెప్పిస్తూ!
"మరీ అంత వినమ్రతను చూపించనక్కర లేదు,
ఇదిగో!నా పేరును ఇలాగనా టైపు చేసేసి కూర్చున్నావు,..."
ఆమె ;;
''''''
"ఏమి సార్!నేను కరెక్టు దానే సేసి పూడుస్తిని,ఏమి ఉండినది?"
"నా పేరు పురుషోత్తమ రావు 'ఔనా!?!!!!!??
"ఆమ సారు వాడూ!>>"
"మరి ఇలాగ 'పురుగోత్తమ రావు 'అంటూ వేసి పడేసినావేందబ్బా????!"
"ఆమ!మా తమిళములో 'గ 'ఓన్లీ హల్లుల లిపిలో ఉండాది,
ఇంతకీ అందులోన ఏమి తప్పు వచ్చి ఉండినాది,సారూ!???"
'''''''''''''''''''''''''''''''''
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment