'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
''''''''''''''''

దుత్తలోని పాలు సుధా తుల్యములు ;;;;; 
''''''''''''''''''''''''''   
 తొలి పొద్దు ఆయెను 
నీల మేఘ శ్యాముడు 
పాలు పిదుక వేం చేశాడు
గోమాతకు వందనమిడి
 క్షీరములను పిదుక సాగె // 
పాల తుంపురులు తొణుకాడుచు ఎగసేను 
పాలు చింది క్రిష్ణయ్యను హత్తు కొనుగ  
నీలి మేఘఛాయపైన ముత్తెముల క్రోవలాయె. చుయ్....చుయ్......చుయ్.........      //  
పాల సుధల గోపాలుడు సుతారముగ పిదుక సాగె.  
చివురు వ్రేళ్ళ తెలి గోరుల  వికసించెను సూర్య రశ్మి  
నఖములపై హరి విల్లుల 
వీక్షించుచు క్షీరములు 
హర్షమ్ములు ఉప్పొంగగ 
వేలాదిగ తెలి నురుగుల 
కోట్లాదిగ ఇంద్ర ధను(వు)లు  
ఉంగరముల కురుల హొయలుల నీడల 
సొంపు సౌరభములన్నీ 
తమలోనే లీనమవగ 
దుత్తలోని పాలన్నీ  
పొంగు పాల కడలులే ఆయెను 
హరి ముంగురుల సొగసులతో 
హరి విల్లుల సొబగులతో 
పాల వడుల సుడుల వయ్యారాలు ఎన్న తరమా?
'''''''''''''''''''''''''''''''''''''''''' 
No comments:
Post a Comment