Tuesday, May 5, 2009

గడసరి మనస్సు

గడసరి మనస్సు ;;;;
'''''''''''  
నా హృదయాన్ని 
ఆనంద ద్వారానికి 
తలుపుగా నిర్మించుకున్నాను  

పరిచిత భావాలను పిలవడానికి  
నీవు తలుపు తట్టినపుడు 
అఱ చేతి స్పర్శలోని మార్దవత్వం 
నా మేనుకు 
మకరికా రేఖలుగా 
చిత్రములుగా 
చిత్రంగా చిత్రించబడే మధుర అవకాశా లెపుడూ  
విస్తృతంగా ఉంటూనే ఉంటాయనే 
వాస్తవాన్ని నేను గ్రహించాననీ.....  

ఆ నా గడసరి తనాన్ని నీవు గుర్తించినపుడు 
లౌక్యముగా.... 
నీ బింబాధరాల వెనుక 
లీలగా దాక్కున్న 
నీ మందహాసాలను 
నేనుగమనించి కూడా, 
గమనించనట్లుగా నటించే  
"ఈ నా లౌక్యము"కూడా 
బహు గడసరిదే కదూ!చెలీ!  


'''''''''''''''''

No comments:

Post a Comment