'''''''''''

వాసంతం వచ్చింది 
కొండ కోన ఆకు,పూలు  
అణువణువును ప్రేమ మీర 
సుతి మెత్తగ నిమిరింది //  
పొన్నాయి పూలివిగో! 
పూల జడలు అల్లండి 
కొబ్బరాకు ఈనెలు ఇవి 
బుజ్జి బుట్టలల్లండి.  
పచ్చనైన మామిడాకులు
బూరాలను చుట్టండి! 
మామిడాకు పి ప్పి ప్పీ!
ఈలలు,బూరాలూ  
ఇవి అన్నీ మీ కొరకే! 
రా రండీ!వేగిరమే! బాలలూ!"
అని అంటూ పిలుస్తూంది వాసంతము  //
పైరు గుబాళింపుల 
బుజ బుజ బూజం బంతి ! 
గొబ్బెమ్మలు, రంగ వల్లి 
చేయండీ! బొమ్మల పెళ్ళి!   
పెళ్ళి విందు ఆటలు 
సృష్టి కర్తకు కను విందులు,ఇంపులు!   
,,,,,,,,,,,,,,,,,
No comments:
Post a Comment