
Kovela ;;;;;;
''''''''''
తమలపాకుల చిలకలీయవే!
By kadambari piduri, Feb 5 2009 9:13PM
పుండరీకాక్షునికి
పరమానంద రూపునికి
తమలపాకుల చిలకలీయవే!
చిలుకా!
నీ అరచేత లేలేత
పచ్చనాకులను
జీవితముగా కూర్చి
ఇచ్చినాడే! విభుడు!
పరికించి చేసేటి
కర్మల ఫలములు
చక్కనీ వక్కలుగ
వెలసెనే! చూడు!
కొండంత పాపాల
ఖండించ వలెననెడి
ఇసుమంత భావమే
సున్నమయ్యెను నేడు
అన్నిటిని కలబోసి
ఆ పైన కల నూర్చి
చిరు నవులు నీ కొసగునే!
స్వామి
వెల తూచలేనంత
ఆనందముల నొసగునే!
No comments:
Post a Comment