Thursday, May 14, 2009

కొంగు చాటు బిడ్డ




'''''''''''''''


కొంగు చాటు బిడ్డ ;;;;;;;;;
''''''''''''


1)పాలు గారు
నీ బుగ్గలు పుణికిన
వర మాతృత్వము
నాదేరా!
చిత్ర శోధనగా
మరి,తరచి తరచి
తరియించిన యశోద మాతనురా!

'''''''''''''''''''''''''''''''''''
2)వేణు దండమున
గారపు దండన!
వెక్కిరించెదవు,ఔరా!నన్ను!

'''''''''''''''''''''''''''''''''''
3)లక్షణ గీతము నీవేరా!
నా లక్ష్యము సాంతము నీవేరా!
నాకెరుక పడిన
ఈ స్వర్ణ క్షణముల
సర్వ వ్యాప్తివి నీవేరా!

'''''''''''''''''''''''''''''''''''''
4)నా చక్షువులందున
సాగెడి దృక్కుల
జాతి నీలమువు నీవేరా!
నీలాంబరమువు నీవేరా!

''''''''''''''''''''''''''''''''''''''
5)వల పక్షము పూనకు,
నను చిన్న బుచ్చకుము
నా పక్షము నీవను
బలము గొప్పదిర!
నా తలపులన్నిటికి
మొలుచు పక్షములు"
గరుత్మంతుడై
విను వీధులలో
నా మానసము
విహరించునురా!

''''''''''''''''''''''''''''''''''''''''
6)"కొంగు చాటున బిడ్డవు నీవ"ని
నిన్నటి దాకా భ్రమసితిరా!
"నీ కొంగుయె
నాకు 'రక్షక పత్రము.'అనుచూ నీవు
నాదు చుబుకము పుణికి
ఏమారుస్తూ,ఓదార్చుదువు.
అమ్మను నేనని మరచేలాగున,
నా కన్నయ్యా!నాదు కన్న తండ్రీ!

'''''''''''''''''''''''''''''''''''''''''

7)జీవినిరా
నేను,నీ సన్నిధి
"శ్రీ దివ్య సీమను"పొందిన
"సంజీవినిని"


''''''''''''''''''''''''''''''''''''''''''

No comments:

Post a Comment