
''''''''''''''''''''''''''''''''''''''''''''''''
నిరంతర గాన రవళి ;;;;;;;;
'''''''''''''
తమో వాహినిలో
నిశ్చల తపస్సు చేసిన "వెలుతురు"
నీ మురళీ గానములో
ఉదయ కాంతిగా వెలికి వచ్చింది.
నీరవ నిశ్శబ్దంలో
ధ్యాన నిమగ్నయై ఉన్నది నాదోంకారము.
వెలుగు రాశులతో
ధరణీ తలం అవుతూన్న్నది
చైతన్య బృందావని.
ప్రణయ తటిల్లతలు
నీ సిగలో పింఛముతో
మెరుపులను పంచుకుంటున్నాయి.
పూ గుచ్ఛంలో నుండి
"పిల్లి మొగ్గలు"వేస్తూ,ఆటలాడుతూన్న
పరిమళాల బాల బాలికలు
నీ వేణు గాన తుషారములో
ఓలలాడుతూ
మృదు సమీరాలతో
వినోదాలను పంచుకుంటున్నాయి.
కృష్ణా!
మ్రోగించుమోయీ,మురళి!
''''''''''''''''''''''''''''''''''''''''''''''''
No comments:
Post a Comment