అంబరాన తొలకరుల ;
మబ్బులు గుంపులు గుంపులు ;
రాధ మదిని గుంజాటన ;
గుబులు గుబులు గుంపులు ; ||
;
పెరటి జామ దోర పళ్ళు ;
ఎత్తైన చెట్ల కొమ్మలందున్న సపోటాలు ;
మేలి ముసుగులోన కుక్కి ;
మూట కట్టి, బయలు దేరె రాధమ్మ ; ||
;
పల్లవాధర క్రిష్ణుడు, వేణు గాన లోలుడు ;
మురళీ వాదనలో క్రిష్ణ - ఆకలినే మరచును ;
మొదలసలే తన ఆకలినే మరచును ;
అనుచు - రాధ మదిని గుంజాటన ; ||
;
పరుగులెత్తు గోవులతో చికాకులు ;
దుష్టుల అజ్ఞాన పనులతోటి చిరాకులు ;
లోక రక్షణల వేగే క్రిష్ణమూర్తి ;
ఆకలినే - మరచుననుచు -
రాధ మదిని గుంజాటన ; ||
;
ఏమరుపాటున మనము ;
ఉంటే ఎట్లాగమ్మా!?
గుర్తు చేయాలి కదటమ్మా ,
రాధ మదిని గుంజాటన
గుబులు గుబులు గుంపులు ; ||
;
=======================;
;
;
ambaraana tolakarula ;
mabbulu gumpulu gumpulu ;
raadha madini gumjATana ;
gubulu gubulu gumpulu ; ||
;
peraTi jaama dOra paLLu ;
ettaina ceTla kommalamdunna sapOTAlu ;
mEli musugulOna kukki ;
muuTa kaTTi, bayalu dEre raadhamma ; ||
;
pallawaadhara krishNuDu, wENu gaana lOluDu ;
muraLI waadanalO krishNayya aakalinE maracunu ;
modalasalE tana aakalinE maracunu ; ;
anucu - raadha madini gumjATana ; ||
;
parugulettu gOwulatO cikaakulu ;
dushTula aj~naana panulatOTi ciraakulu ;
lOka rakshaNala wEgE krishNamuurti ;
aakalinE maracunu - raadha madini gumjATana ;
;
EmarupATuna manamu ;
umTE eTlAgammA!?
gurtu cEyaali kadaTammaa ,
raadha madini gumjATana ;
gubulu gubulu gumpulu ; ||
;
No comments:
Post a Comment