సాంద్రం, మంద్రం చిరు గాలి ;
కోపం వస్తే సుడి గాలి ;
రౌద్రం వస్తే సడిగాలి ;
జడిపించేను లోకాల్ని ;
;
ఉడుకుమోతు ఐ చిరుగాలి ;
మిడి మిడి మిడుకుతు ఉన్నట్టి
ఈ ఈదురు గాలి ;
గడ బిడ ముడి వడి - ఈదర గాలి ; ||
;
సెగల ఊష్ణమౌ వడ గాలి ;
వానల వెల్లువ దడగాలి ;
గమ్ముగ ఊరక ఉండదుగా ;
ప్రభంజనమ్ముగ హోరెత్తు ; ||
;
ఔషధ మొకటే తనకంట ;
రవంత చోటు చాలంట ;
క్రిష్ణ మురళిలో ;
రవంత చోటు చాలంట ; ||
;
=======================;
;
;
No comments:
Post a Comment