అణువణువు ప్రకృతి ;
మనుగడకు అదె కృతి ;
మానవాళికి తథ్యమీ
నిత్య ఫలశృతి - నందలాల ; ||
;
ఆరుబయలున చాల ;
ఆలమందలు గాచి ;
పని సోమరులకు నీవు ;
చూపిన తర్జని నందలాల ; ||
;
మొండి గుర్రాలను ;
మచ్చికలు చేసేసి ;
ఐనావు రణమున ;
తేరుకు సారధి నందలాల ; ||
;
నిలువెత్తు తార్కాణ
మీవె కార్యమ్ముల ;
చాటితివి జగతికి ;
లక్ష్య సిద్ధిని సూటి నందలాల ; ||
;
జనని గీసిన గీటును దాటనంటూనే -
లోకముల కొసగావు -
మేటి భగవద్ గీత, నందలాల ;
భళి భళీ ఆనందలాల ;
;
అణువణువు ప్రకృతి ;
మనుగడకు అదె కృతి ;
మరపు రానీయవు ;
మానవాళికి తథ్యమీ
నిత్య ఫలశృతి నందలాల ;
అందించినావు కద నందలాల ; ||
;
=======================;
;
aNuwaNuwu prakRti ;
manugaDaku ade kRti ;
maanawALiki tathyamee
nitya phalaSRti నందలాల; ||
;
aarubayaluna caala ;
aalamamdalu gaaci ;
pani sOmarulaku neewu ;
cuupina tarjani నందలాల ; ||
;
momDi gurraalanu ;
maccikalu cEsEsi ;
ainaawu raNamuna ;
tEruku saaradhi నందలాల ; ||
;
niluwettu taarkaaNa
meewe kaaryammula ;
caaTitiwi jagatiki ;
lakshya siddhini suuTi నందలాల ; ||
;
aNuwaNuwu prakRti ;
manugaDaku ade kRti ;
marapu raaneeyawu ;
maanawALiki tathyamee
nitya phalaSRti నందలాల
amdimcinaawu kada నందలాల ; || ;
;
No comments:
Post a Comment