నవనీత చోరుని పట్టుకుంటిమి ;
ఒడుపుగాను, నేర్పుగాను పట్టేసాము ; ||
;
ఇంద్రనీల ఛాయ వాని దేహము పయి ;
చాల పాల తుంపరలు -
వెన్న తుప్పరల ముత్యాల సిరులు ;
దొంగ ఆనవాలు ఇట్టె ;
పట్టించి ఇచ్చేను గదా ; ||
;
మౌక్తిక హారముల సొబగు భలే భలే ;
పూస వెన్న కిటుకులు భలే భలే ;
తెలి ముత్యపు దండల - కోటి చంద్రికల ధవళిమ ;
ఇల కెపుడును పున్నమ ;
శీతలాహ్లాదముల నిత్య పున్నమ ; ||
;
======================;
;
indra neela CAya waani payi ;
caala paala tumparalu -
wenna tupparala mutyaala sirulu ;
domga aanawaalu iTTe ;
paTTimci iccEnu gadaa ; ||
;
mauktika haaraముla sobagu BalE BalE ;
puusa wenna kiTukulu BalE BalE ;
teli mutyapu damDala kOTi camdrikala dhawaLima ;
ila kepuDunu punnama ;
Siitalaahlaadamula nitya punnama ; ||
;
No comments:
Post a Comment