ఆటలు ఆడేరు, పాటలు పాడేరు ;
భాండీరంలో తోటలన్నియు చైతన్యం అయ్యేను ;
చైతన్య మయములయ్యేను :
;
క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా! : ||
;
చద్ది బువ్వ మూటలను కొమ్మలకు కట్టారు ;
చేతి కర్రలను పట్టి ; నడుములకు తుండ్లు కట్టి ;
గిల్లి దండ, ఉప్పాటలు ; కబడి ఆటలెన్నెన్నో
ఆడేరు క్రిష్ణ బృందము ; శ్రీక్రిష్ణ బృందము :
||క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా!||
;
మట్టి, దుమ్ము ధూళి దూసరములగుతూ ఒళ్ళంతా ;
ఆడేరు క్రిష్ణ బృందము ; శ్రీక్రిష్ణ బృందము ;
నేల తల్లి పులకించును ; ఈ బిడ్డల స్పర్శతోటి ;
||క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా!||
;
క్రిష్ణ మాయ అంటేను - అందమైన కదలిక ;
శ్రీక్రిష్ణ మాయ అంటేను - కదలికలకు కళ కళా ;
అందులకే క్రిష్ణ మాయ - అందరికీ ఆకర్షణ ;
అందుకునే సామర్ధ్యం స్వామి భక్తులందరిదీ ;
ఆ ఆదర్శం అనుసరణ ; విజయపథం దిశ నడక :
||క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా!||
;
===================================;
;
aaTalu ADEru ; paaTalu paaDEru ;
bhaamDeeramlO tOTalanniyu caitanyam ayyEnu ;
caitanyamayamulayyEnu ; ||
;
krishNa maaya amTEnu - idE kadaa cuustumTE :
SreekrishNa maaya amTEnu -
idiye kaduTe, Oyammaa! : ||
;
caddi buwwa mUTalanu kommalaku kaTTAru ;
cEti karralanu paTTi ; naDumulaku tumDlu kaTTi ;
gilli damDa, uppATalu ; kabaDi ATalennennO ;
aaDEru krishNa bRmdam ;
Sree krishNa bRmdamu ;
||krishNa maaya amTEnu - idE kadaa cuustumTE :
SreekrishNa maaya amTEnu - idiye kaduTe, Oyammaa! ||
;
maTTi, dummu dhULi duusaramulagutuu oLLamtaa ;
nEla talli pulakimcunu ; ee biDDala sparSatOTi ;
krishNa maaya amTEnu - amdamaina kadalika ;
SreekrishNa maaya amTEnu - kadalikalaku kaLa kaLA ;
krishNa maaya amTEnu - amdamaina kadalika ;
శ్రీ SreekrishNa maaya amTEnu - kadalikalaku kaLa kaLA ;
amdulakE krishNa maaya - amdarikee aakarshaNa ;
amdukunE saamardhyam swaami bhaktulamdaridee ;
aa aadarSam anusaraNa ; wijayapatham diSa naDaka ;
||krishNa maaya amTEnu - idE kadaa cuustumTE :
SreekrishNa maaya amTEnu - idiye kaduTe, Oyammaa! ||
;
No comments:
Post a Comment